బాలాత్రిపుర సుందరిగా విజయదుర్గ | - | Sakshi
Sakshi News home page

బాలాత్రిపుర సుందరిగా విజయదుర్గ

Oct 13 2026 1:05 AM | Updated on Oct 13 2026 1:05 AM

జిల్లా కేంద్రంలోని నానుబాల వీధిలో విజయదుర్గా ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని సోమవారం బాలా త్రిపుర సుందరిగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

– శ్రీకాకుళం కల్చరల్‌

రెజ్లింగ్‌ పోటీల్లో పతకాల పంట

శ్రీకాకుళం న్యూకాలనీ: స్కూల్‌గేమ్స్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో శ్రీకాకుళం విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే అనేక క్రీడాంశాల్లో విజయబావుటా ఎగురవేసిన జిల్లా క్రీడాకారులు తాజాగా రెజ్లింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ తదితర క్రీడాంశాల్లో సత్తాచాటారు. పల్నాడు జిల్లా కారెంపూడి వేదికగా ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు జరిగిన 70వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో మురళీకృష్ణ(ఆమదాలవలస) బంగారు పతకం, ఎస్‌.అపర్ణ (జెడ్పీహెచ్‌ స్కూల్‌ కంచరాం) రజత పతకం, కె.లావణ్య (జెడ్పీహెచ్‌ స్కూల్‌ ఎందువ) కాంస్య పతకం, జె.జయరాం, పి.చాందిని కాంస్య పతకాలు సాధించారు. వీరిలో ఆమదాలవలసకు చెందిన మురళీకృష్ణ ఢిల్లీలో త్వరలో జరిగే జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యాడు. విజేతలను డీఈఓ ఎ.రవిబాబు, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శులు చల్లా జగదీష్‌, జీఎం జ్యోతిరాణి, పీఈటీ సంఘ నాయకులు ఎం.వి.రమణ, పి.తవిటయ్య, ఒలింపిక్‌ సంఘ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

అగ్రిగోల్డ్‌ బాధితుల బాండ్ల సేకరణ తేదీలు ఖరారు

శ్రీకాకుళం క్రైమ్‌ : జిల్లాలో అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి ఒరిజనల్‌ బాండ్ల సేకరణ కార్యక్రమానికి మండలాల వారీగా తేదీలను ఖరారు చేశామని సీఐడీ డీఎస్పీ ఎన్‌.కాళిదాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో ఎల్‌.ఎన్‌.పేట, జి.సిగడాం మండలాలు, అక్టోబర్‌ 16, 17, 19, 21 తేదీల్లో లావేరు మండలాలకు చెందిన బాధితుల నుంచి సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. హాజరుకాలేని వారికోసం మరో తేదీని నిర్ణయించి తెలియజేస్తామన్నారు, మిగిలిన మండలాల వారికోసం మరోసారి తేదీలను ప్రకటిస్తామన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం సమీపంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో, ఎస్సీ, ఎస్టీ భవనంపై కౌన్సిలింగ్‌ హాల్‌లో కేంద్రంలోనూ బాండ్లు సేకరిస్తామని తెలిపారు. సందేహలున్నవారు సీఐడీ డీఎస్పీ కాళిదాస్‌ 7036228899 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఎర్ర చందనం వస్తోందంటూ..!

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం రూరల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. విశాఖపట్నం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ వాహనం శ్రీకాకుళం జాతీయ రహదారి మీదుగా వస్తోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా పోలీసులు జల్లెడపట్టారు. పెదపాడు రూరల్‌ పోలీస్టేషన్‌ నుంచి సుమారు రెండు కిలోమీటర్లు వరకూ వాహనాలను నిలుపుదల చేస్తూ తనిఖీలు చేశారు. స్మగ్లర్లు ఫోన్లు స్విచాఫ్‌ చేయడంతో చేసేదేమీ లేక మిగిలిన వాహనాలను తనిఖీ చేస్తూ పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement