వార్డులవారీగా రిజర్వేషన్లు
మొత్తం వార్డులు 36
బీసీ జనరల్ 7
బీసీ మహిళలు 6
ఎస్సీ మహిళలు 2
ఎస్సీ జనరల్ 2
అన్ రిజర్వ్‌డ్ 8
జనరల్ (మహిళలు) 10
ఎస్టీ 01
1996లో పలాన నగర పంచాయతీగా ఏర్పాటైంది. 2000–2002లో పలాస –కాశీబుగ్గ కంబైండ్ మున్సిపాలిటీ(సెకండ్ గ్రేడ్)గా ఏర్పాటైంది. 2002లో జరిగిన మొదటి ఎన్నికల్లో జనరల్ కేటగిరీ కింద రిజర్వు కాగా, మొదటి చైర్మన్‌గా వజ్జ బాబూరావు పనిచేశారు. 2007 ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వేషన్ కాగా, 2014లో జనరల్ కేటగిరి కింద, 2021లో జనరల్ కేటగిరి కింద రిజర్వు అయింది. చివరి ఎన్నికల్లో బల్ల గిరిబాబు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా జరగనున్న ఎన్నికలకు జనరల్ మహిళ రిజర్వేషన్ ఖరారైంది.


