సరైన ట్రాక్‌లో దర్యాప్తు | - | Sakshi
Sakshi News home page

సరైన ట్రాక్‌లో దర్యాప్తు

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

భూమిని కాపాడుకుంటాంతమ భూమిని కాపాడుకుంటామని పున్నాం గ్రామస్తులు అన్నారు. వారు ఆందోళనలు చేస్తున్నారు. –8లో

న్యూస్‌రీల్‌

శ్రీకాకుళం
భూమిని కాపాడుకుంటాంతమ భూమిని కాపాడుకుంటామని పున్నాం గ్రామస్తులు అన్నారు. వారు ఆందోళనలు చేస్తున్నారు. –8లో

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

అస్సోంకు చెందిన విద్యార్థిని హిమశ్రీ బోరో మృతిపై జిల్లా పోలీసులతో పాటు రైల్వే పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, రైల్వే ఐజీ రాజకుమారి, ఫోరెన్సిక్‌ సైన్స్‌ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) డైరెక్టర్‌ మార్గదర్శక ఆదేశాలతో ఆదివారం శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీసులే కాక విశాఖపట్నం రైల్వే డీఎస్‌ఆర్‌పీ కె. ప్రదీప్‌, కె.ప్రమోద్‌లు రైలు నుంచి హిమశ్రీ బోరో పడిన తీరుపై తమ బృందాలతో కలసి శాసీ్త్రయ అనుకరణ ప్రయోగం నిర్వహించారు. ఈ నెల 7న విశాఖలో రైలెక్కిన ఆమె శ్రీకాకుళం జిల్లా దూసి– పెనుబర్తి గ్రామాల మధ్య రైలు పట్టాల పక్కన శవమై తేలడం, రైలులో ఉన్నప్పుడే ‘నా చుట్టూ చాలామంది మగవాళ్లున్నారు.. నాకు భయంగా ఉంది..’ అంటూ కుటుంబసభ్యులకు ఆమె చివరి సందేశం పంపడం, ఘటన వెనుక నేర కోణం జరిగిందన్న భావనలో అస్సోంలో విద్యార్థుల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఈ అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ప్రయోగ

ఉద్దేశమిదే..

కదులుతున్న రైలు నుంచి ఆమె ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉండవచ్చనే అంశాన్ని శాసీ్త్రయంగా పరిశీలించేందుకు వివిధ పరిస్థితుల్లో ఉపయోగించిన వస్తువుల కదలికలు, అవి పడిన విధానాన్ని పరిశీలించి అంశాలను నమోదు చేసి ఇతర ఆధారాలు, ఫోరెన్సిక్‌ నివేదికలు, దర్యాప్తులో సేకరించిన సమాచార విశ్లేషణలతో పోల్చి అంచనా వేయడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశమని రైల్వే విశాఖ డీపీఆర్‌సీ పేర్కొన్నారు.

ఇలా చేశారు..

ఈ ప్రయోగంలో రెండు మానవ నమూనాలు (మేనిక్విన్స్‌), రెండు రాళ్లను ఉపయోగించి వివిధ పరిస్థితుల్లో అవి కదులుతున్న రైలు నుంచి పడినప్పుడు వాటి కదలికలు, పతన పథం (ట్రాజెక్టరీ) ఎలా ఉంటాయో పరిశీలించి నమోదు చేశారు. మృతురాలి శరీర బరువు ఉండేలా మానవ నమూనాలను సిద్ధం చేశారు. రాళ్ల కదలికలు, అవి పడిన విధానాన్ని సులభంగా గుర్తించి పరిశీలించేందుకు వాటికి వేర్వేరు రంగుల పెయింటింగ్‌ పూసి పరిస్థితులను పరిశీలించేందుకు 4 బృందాలను ఏర్పాటు చేశారు.

అస్సోం యువతి హిమశ్రీ బోరో

మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు

రైలు నుంచి పడిన తీరుపై శాసీ్త్రయ అనుకరణ ప్రయోగం

రాష్ట్ర డీజీపీ, రైల్వే ఐజీ ఆదేశాలతో రైల్వే, జిల్లా పోలీసులు, సంయుక్తంగా ఘటనాస్థలిలో ప్రయోగ నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement