ప్రయాణం భద్రమేనా..? | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం భద్రమేనా..?

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

● అస్సోం యువతి మృతితో రైలు ప్రయాణాల్లో భద్రతపై అనుమానాలు

● నిత్యం కిక్కిరిసిన రైళ్లలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అస్సోం యువతి మరణం.. రైలు ప్రయాణాల్లో భద్రతను ప్రశ్నార్థకం చేసింది. కిక్కిరిసిన రైళ్లలో ఇబ్బందులు పడుతూ ప్రయాణాలు, రిజర్వేషన్‌ బోగీల్లోనూ పరిమితికి మించి ప్రయాణాలు, ఏఓబీలో రైళ్లలోనే గంజాయి అక్రమ రవాణాలు, అక్కడక్కడా మందు బాబుల విన్యాసాలు వంటివి ప్రయాణికులను నిత్యం భయపెడుతూనే ఉన్నాయి.

మనం సేఫేనా..?

రైలు ప్రయాణాల్లో మహిళలకు వేధింపులు జిల్లాలో సంఖ్యాపరంగా తక్కువే కానీ ఇచ్ఛాపురం, పలాస వంటి రైల్వే స్టేషన్లను చాలా మంది గంజాయి అక్ర మ రవాణాకు అడ్డాగా వాడుకుంటున్నారు. వారి వల్ల ఎప్పటికై నా ప్రమాదం పొంచే ఉంది. మరీ ముఖ్యంగా ఒడిశా నుంచి పశ్చిమ బెంగాల్‌, అస్సోం వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు అధ్వానంగా ఉంటున్నా యనే వాదన ఎప్పటి నుంచో ఉంది. మద్యపాన ప్రియులు, ఆకతాయిలు ఎక్కువగా ఉంటున్నారనే ఫిర్యాదులు చాలాకాలంగా వినిపిస్తూనే ఉంటున్నాయి. వీటిపై చర్యలు తీసుకున్న దాఖలాలేవీ లేవు. ఇక జనరల్‌ బోగీల్లో పరిస్థితి నానాటికీ మరీ దిగజారుతోంది. కనీసం నిలబడేందుకై నా చోటు లేని బోగీల్లో ఎప్పటికప్పుడు గొడవలు, తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ బోగీలు మరీ పరిమితంగా ఉన్న పరిస్థితుల్లో సామాన్యులు ఈ అవస్థలు పడుతూనే ప్రయాణం సాగించాల్సి వస్తోంది.

అవగాహన ఉందా..?

రైల్‌ మదద్‌ వంటి యాప్‌లు రైల్వే టోల్‌ ఫ్రీ నంబర్ల గురించి జిల్లా ప్రయాణికులకు అంతగా అవగా హన కల్పించడం లేదు. అస్సోం యువతి విషయంలో యాప్‌లో ఫిర్యాదు చేసినా కాపాడలేకపోయారు. దీనిపై రైల్వే పోలీసులు చొరవ తీసుకుని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఊళ్లలో బెల్టు షాపుల వల్ల ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్న మద్యం వల్ల చాలా మంది తాగి ప్రయాణాలు చేస్తున్నారు. మద్యం తాగుతున్నప్పుడు అధికారులు పట్టుకుంటే కేసు అవుతుందని తెలిసి కూడా ఈ తప్పు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల బయట లెక్కకు మిక్కిలి షాపులు ఉండడంతో బయటే పని కానిచ్చేసి చక్కగా రైలెక్కుతున్నారు. ఈ వైఖరి మహిళలకు ఎప్పటికై నా అపాయకరమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement