● 13 మంది స్టార్ అథ్లెట్స్‌తో కూడిన జాబితా వెల్లడి
● నవంబర్ 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో టోర్నీ
శ్రీకాకుళం న్యూకాలనీ: డైరెక్ట్ నేషనల్స్ అథ్లెటిక్స్ మీట్‌కు సిక్కోలు బృందం ఖరారైంది. ఈ మెగా టోర్నీకి నెలరోజుల ముందే జిల్లా క్రీడాకారుల జాబితాను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రకటించింది. నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న 20వ జాతీయ అంతర్‌జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్(ఎన్‌ఐడిజేఏఎం)కు శ్రీకాకుళం జిల్లా నుంచి 13 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులను ఎంపికచేశారు. ఈ నెల 10న శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో మెరుగైన ట్రాక్ రికార్డులు కలిగిన అథ్లెట్లను ఈ మెగా మీట్‌కు ఎంపికచేశారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర చైర్మన్, జిల్లా చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు) సూచనల మేరకు ఎంపికై న ఈ 13 మందిని జాతీయ పోటీల కోసం తీర్చిదిద్దాలని నిర్ణయించారు. వారు చదువుతున్న పాఠశాలలు/సమీప పాఠశాలల్లో పీడీలు, కోచ్‌ల సమక్షంలో పూర్తిస్థాయిలో శిక్షణ అందించనున్నారు. ఎంపికై న వారు జనన ధ్రువీకరణ పత్రం, మున్సిపల్/తహసీల్దార్ అధికారులు ఇచ్చిన బర్త్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, ఏఎఫ్‌ఐ యుఐడీ, పాస్‌ఫోటోలు సిద్ధం చేసుకోవాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి పేర్కొన్నారు. వీరి ఎంపిక కావడం పట్ల ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, సలహాదారు పి.సుందరరావు, నౌపడ విజయ్‌కుమార్, వాండ్రంగి శ్రీనివాసరావు, కె.మాధవరావు, బీవీ రమణ, కె.హరిబాబు, టి.శ్రీనివాసరావు, చల్లా జగదీష్, డీఎస్‌డీఓ ఎ.మహేష్‌బాబు, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య తదితరులు హర్షం వ్యక్తంచేశారు.
ఎంపికై న క్రీడాకారులు వీరే:
● అండర్–14 విభాగానికి ఎస్.దీక్షిత్ (ట్రైయాథ్లెన్–ఏ), జి.గౌతమ్‌కుమార్ (ట్రైయాథ్లెన్–సి), ఎల్.కీర్తి (ట్రైయాథ్లెన్–ఏ), ఎస్.ధరాగ్నిస్మి (ట్రైయాథ్లెన్–సి) ఎంపికయ్యారు.
● అండర్–16 విభాగానికి బి.కార్తీక్ (600 మీటర్ల పరుగు), టి.విష్షు (80మీటర్ల హార్డిల్స్), బి.కార్తీక్ (600మీటర్ల పరుగు), కె.శ్రీధర్ (హైజంప్), బి.భరత్‌చంద్ర (షాట్‌పుట్), జి.కేదారనాథ్ (పెంటాథ్లెన్), ఆర్.ఝాన్సీ (60మీటర్ల పరుగు), పి.సోనాక్షి (600 మీటర్ల పరుగు), సమీర బిసాయి (జావెలిన్‌త్రో) ఎంపికై నవారిలో ఉన్నారు.


