సమష్టి కృషితోనే పార్టీ పటిష్టం | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే పార్టీ పటిష్టం

Oct 7 2026 1:52 AM | Updated on Oct 7 2026 1:52 AM

● ౖవెఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాలన్నీ సమష్టిగా పనిచేస్తేనే పార్టీ మరింత బలోపేతమవుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. పార్టీలో అనుబంధ విభాగాలదే కీలక పాత్ర అని అన్నారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయం టౌన్‌హాల్‌లో మంగళవారం అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్‌ వారితో మాట్లాడుతూ అన్ని విభాగాలకు సంబంధించి నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో అన్ని పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రి య మరింత వేగవంతం చేయాలన్నారు. ఈ నెల 10 వతేదీ నాటికి పూర్తిచేసి పూర్తిస్థాయి జాబితా అందించాలని సూచించారు. స్థానిక సంస్థలు, కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులంతా కలసికట్టుగా పనిచేసి విజయం సాధించాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లను గెలిపించేందుకు అనుబంధ విభాగాల నాయకులు కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. కూటమి నేతల మోసాలు, అబద్ధాలు, వైఫల్యాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో చెప్పాలని, వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రజలకు అందించిన సంక్షేమ, అభివృద్ధిని గుర్తు చేయా లని సూచించారు.

సమావేశంలో యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య, అనుబంధ విభాగాల కో–ఆర్డినేటర్‌ సన పల నారాయణరావు, యువజన డాక్టర్స్‌ విభాగం అధ్యక్షులు చింతాడ వరుణ్‌, విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్తా విజయ్‌కుమార్‌, బీసీ విభాగం అధ్య క్షుడు మార్పు అశోక్‌చక్రవర్తి, మహిళా విభాగం జిల్లా అద్యక్షురాలు ఉలాల దివ్యభారతి, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు ఎం.ఏ భేగ్‌, ఎస్సీసెల్‌ విభాగం ముంజేటి కృష్ణమూర్తి, వలంటీర్‌ విభాగం అధ్యక్షులు గంట్యాడ రమేష్‌, వైఎస్సార్‌టీఎఫ్‌ జల్లు బలరామనాయుడు, ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం అధ్యక్షులు పప్పల రాధాకృష్ణ, గ్రీవెన్స్‌సెల్‌ అధ్యక్షులు రౌతు శంకరరావు, ఐటీ విభాగం అధ్య క్షుడు ఉప్పాడ విజయ్‌కుమార్‌రెడ్డి, లీగల్‌సెల్‌ విభా గం అధ్యక్షులు ఆరంగి లక్ష్మీపతి, వైఎస్సార్‌ టీయూ సీ అధ్యక్షుడు డొప్ప రాము. ఆర్టీసియన్‌ అధ్యక్షులు నాగవరపు సత్యం, ఎస్టీసెల్‌ అధ్యక్షులు సవర దంబురు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అనుబంధ వి భాగాల కో–ఆర్డినేటర్‌గా నూతనంగా నియమితు లైన సనపల నారాయణరావును సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement