ఈ సర్కారే శుద్ధ దండగ! | - | Sakshi
Sakshi News home page

ఈ సర్కారే శుద్ధ దండగ!

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

కాదు.. ●

వ్యవసాయం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):

వ్యవసాయాధారిత భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ రైతులను ప్రోత్సహిస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చంద్రబాబు సర్కారు వ్యవసాయం దండగ అనే రీతిలో పాలించడం సరికాదని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. నిరాశ నిస్పృహలో ఉన్న రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు పలు రకాలుగా ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా ఉంటూ వారి తరఫున వైఎస్సార్‌ సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గొండు రఘురాం ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం సమావేశం బుధవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

వైఎస్సార్‌సీపీ యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు మాట్లాడుతూ యూరియా, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌లో అమ్ముకున్న చరిత్ర చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలకే దక్కుతుందన్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు పెట్టడం, గొంతు నొక్కడమే చంద్రబాబుకి తెలిసిన పాలన అని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా అకౌంట్లు బ్లాక్‌లో పెట్టినంత మాత్రాన కూటమి పాలకులు చేసిన అన్యాయాలు, అక్రమాలు ప్రజలకు తెలియకుండాపోవన్నారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు గొర్లె అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ అధ్యక్షుడు పీస శ్రీహరి, నరసన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు మడ్డు కృష్ణారావు, అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు సదాశివరాజు, ఎంప్లాయీస్‌ అండ్‌ పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర నాయకులు బుక్కూరు ఉమామహేశ్వరరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఏ విధంగా దగా చేస్తుందో...వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఆదుకున్నారో స్పష్టంగా వివరించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.వి.స్వరూప్‌, ఎస్‌ఈసీ మెంబర్‌ గొండు కృష్ణమూర్తి, ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, మైనార్టీసెల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎంఏ బేగ్‌, గ్రీవెన్స్‌సెల్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్దనరావు, పీస గోపి, గంగు నరేంద్ర, అంధవరపు రమేష్‌, సీపాన రామారావు, కింజరాపు రమేష్‌, భైరి మురళి, మూకళ్ల తాతబాబు, రైతు విభాగం టెక్కలి నియోజకవర్గ అధ్యక్షుడు బగాది దివాకర్‌, రైతు విభాగం నాయకులు పాల్గొన్నారు.

అన్నదాతల పాలిట శాపంగా చంద్రబాబు సర్కారు

రైతులకు జరుగుతున్న అన్యాయంపై

ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం: మాజీ మంత్రి ధర్మాన

కూటమి కాదు సిండికేట్‌ ప్రభుత్వం:

మాజీ మంత్రి సీదిరి

వైఎస్సార్‌సీపీ రైతు విభాగం సమావేశంలో కూటమి పాలనను ఎండగట్టిన నాయకులు

రియల్‌ వ్యాపారం

రైతులే సమాజానికి వెన్నెముకలాంటి వారనేది వైఎస్సార్‌, జగన్‌మోహన్‌రెడ్డిలు నమ్మిన సిద్ధాంతం. వ్యవసాయం దండుగ చంద్రబాబు నినాదమైతే.. వ్యవసాయం దండుగ కాదు ఓ పండుగ అని నిరూపించిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. వర్షాలు పడాలి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజలు కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం వర్షాలు వద్దు అమరావతిలో పనులు నిలిచిపోయతాని తాపత్రయ పడుతున్నారు. జలయజ్ఞంలో భాగంగా వంశధార ప్రాజెక్టుకు రూ.900కోట్లకి పైగా నిధులిచ్చి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన వ్యక్తి వైఎస్సార్‌. రైతుల భూమితో రియల్‌ వ్యాపారం చేసుకుంటున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

– చింతాడ రవికుమార్‌,

ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement