ఏకాంత సేవ నృత్యరూపకం
అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ప్రతి రథసప్తమికి జరిగే సంగీత రూపకముల ‘ఏకాంత సేవ’ను 1995లో మొట్ట మొదటి సారిగా నృత్య రూపకంగా మలిచాను. నేటి వరకు కూడా ఎవరూ స్వామిపై నృత్య రూపకాన్ని రూపొందించలేదు. ఆ అవకాశం ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో నాకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఏన్నో ఏళ్ల క్రితం రచించిన ఆ నృత్య రూపకానికి రూపకల్పన చేసే అవకాశాన్ని ఇప్పిలి శంకరశర్మ కలిగించారు. అప్పట్లో 15 మంది కళాకారులతో రూపకల్పన చేశాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల నుంచి నృత్యరూపకాలను ఎంపిక చేశారు. అందులో నాలుగింటికి రవీంద్ర భారతిలో ప్రద ర్శించే అవకాశం కల్పించారు. ఆ నాలుగింటిలో ఒకటి అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి ఏకాంత సేవ కావడం ఒక విశేషం. 2005లో చిలకలూరిపేట వారు నిర్వహించిన జాతీయ నాట్య రూపుకోత్సవంలో ప్రథమ బహుమతిగా బంగారు పతకం కూడా సాధించాం. ఈ నృత్య రూపకాన్ని 15 సార్లు వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించాం.
– డాక్టర్ రఘపాత్రుని శ్రీకాంత్,
శివశ్రీ నృత్యకళానికేతన్
ఏకాంత సేవ నృత్యరూపకం


