రిపబ్లిక్ వేడుకలకు బయల్దేరిన తప్పెటగుళ్ల బృందం
ఎచ్చెర్ల: ఢిల్లీలో జరగబోయే రాష్ట్రపతి రిపబ్లిక్‌డే వేడుకలకు ఎస్‌ఎం పురం గ్రామానికి చెందిన కోరాడ సత్తిరాజు బృందం మన రాష్ట్రం తరఫున తప్పెటగుళ్ల విభాగంలో పాల్గొనేందుకు బయల్దేరింది. తప్పెటగుళ్లకు పేరొందిన ఎస్‌ఎం పురం కళాకారులకు ఏటా పిలుపు వస్తోంది. ఇది నాల్గోసారి.
ద్విచక్ర వాహనం దగ్ధం
నరసన్నపేట: స్థానిక పల్లిపేట కూడలి వద్ద ప్రమాదవశాత్తూ హోండా కంపెనీకి చెందిన స్కూటీ గురువారం మధ్యాహ్నం దగ్ధమైంది. ఒక మెకానిక్ షెడ్‌లో రిపేర్ కోసం స్కూటీని కేదారి కామేశ్వరరావు పెట్టగా ప్రమాదవశాత్తూ ఒక్క సారి మంటలు వచ్చాయి. స్థానికులు తేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే వాహనం దగ్ధమైంది.
ఎత్తిపోతల పథకంలో చోరీ
టెక్కలి రూరల్: మండలంలోని పోలవరం గ్రామంలో ఉన్న ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగలను చోరీ చేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. గ్రా మం సమీపంలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకంలో గల ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగిని గుర్తు తెలి యని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తు లు గుర్తించి గురువారం టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు.
నరసన్నపేట: రానున్న ఖరీఫ్‌కు సాగునీరు సక్రమంగా అందించేందుకు వీలుగా చేపట్టాల్సిన అత్యవసర పనులు గుర్తించాలని వంశధార ఎస్‌ఈ రామచంద్రరావు అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం నీటి సంఘాల అధ్యక్షులు, ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు సరఫరా చేయడానికి వీలుగా పనులు చేపట్టనున్నామని అన్నారు. ఇప్పటి వరకూ చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని సకాలంలో చెల్లించాలని డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్య క్షుడు శిమ్మ చంద్రశేఖర్, వెంకట అప్పలనాయు డు, నాగరాజు, సత్యం విజ్ఞప్తి చేశారు.
నరసన్నపేట: మండలం బసివలస, బొరిగివలస ప్రాథమిక పాఠశాలలకు చెందిన నలుగురు వి ద్యార్థులు స్పెల్ బీ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్పెల్ బీ పోటీలు నిర్వహిస్తోంది. గురువారం విశాఖలో జోనల్ స్థాయి పోటీలు ఆరిలోవలో జరిగాయి. బసివలస స్కూల్ నుంచి బమ్మిడి యశ్విక (సెకెండ్ క్లాస్) ఇంటివెనుకల నిహారిక (మూడో తరగతి), పాగోటి వెంకట నవీన్(మూడో తరగతి) బొరిగివలస విద్యార్థి తంగి లాస్యశ్రీ (ఐదో తరగతి)లు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈఓలు శాంతారావు, దాలినాయుడు తెలిపారు.
రిపబ్లిక్ వేడుకలకు బయల్దేరిన తప్పెటగుళ్ల బృందం
రిపబ్లిక్ వేడుకలకు బయల్దేరిన తప్పెటగుళ్ల బృందం


