వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక
ఆమదాలవలస: మండలంలోని జీకేవలస గ్రామానికి చెందిన 50 కుటుంబాలు, సర్పంచ్ పంగ సుగుణమ్మ, వార్డు మెంబర్లు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో గురువారం చేరారు. వీరు వైఎస్సార్‌సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో చేరారు. ఆమదాలవలస పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ మా ట్లాడుతూ.. పార్టీ మరింత బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అందించిన పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరామని వారంతా అన్నారు.
పార్టీ రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శి గురుగుబెల్లి శ్రీనివాస్, వైస్ ఎంపీపీలు మానుకొండ వెంకట రమణ, స్వామిరాజుల జగన్నాథులు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు, వివిధ విభాగాల కార్యవర్గ సభ్యులు రామచంద్రరావు, సైలాడ దాసునాయుడు, మొండేటి కూర్మారావు, బొడ్డేపల్లి నాగరాజు, చేపేన విష్ణు, బొడ్డేపల్లి మన్మథ, బగ్గు కుమారస్వామి, పొడిలపు తిరుపతిరావు, గురుగుబెల్లి నవీన్, బొడ్డేపల్లి రాజు పాల్గొన్నారు.


