సు
మధుర హాస్యంసరమ్య గానంగువైన కథనం
భి
● 140 ఏళ్లుగా నాటక సేవ చేస్తున్న ‘సురభి’
● మేకప్పులు, సెట్టింగులు అన్నీ వారివే
ఆ రంగస్థలంపై ఉన్నట్టుండి మంటలు కనిపిస్తాయి. వానలు కురుస్తుంటాయి. మేఘాలు అలా వచ్చి ఇలా పలకరిస్తుంటాయి. వీరబ్రహ్మం కాలజ్ఞానం చెబుతూ కనిపిస్తారు. కృష్ణ పరమాత్ముడు గీతను బోధిస్తూ అభయమిస్తాడు. లవకుశలు వారి అమ్మానాన్నల గొప్పదనాన్ని కీర్తిస్తూ పద్యాలు పాడుతుంటారు. ‘సురభి’ మాత్రమే చేసే మాయ ఇది. ఏ పాన్ ఇండియా సినిమాకు తీసిపోని రీతిలో వీరి సెట్టింగులు మెప్పిస్తుంటాయి. 140 ఏళ్లుగా వీరు నాటక రంగానికి సేవ చేస్తున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ప్రదర్శనలకు వస్తారు. వారు నాటకాన్ని బతికిస్తున్నారు. నాటకం వారిని బతికిస్తోంది.
ర
శ్రీకాకుళం కల్చరల్:
సురభి.. రంగస్థలానికి ఇది మారుపేరు. బుర్రకథలు, హరికథలు వంటివి కాలగర్భంలో కళ్ల ముందే కాలగర్భంలో కలిసిపోతున్నా.. సినిమాలకు, వేరే వైఖరి ప్రదర్శనలకు జనం ఆకర్షితులు అవుతున్నా.. సాధారణ తెలుగును సైతం ‘మీమ్స్’ భాషలో చంపేస్తున్నా.. వీరు మాత్రం నాటకానికి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ అందిస్తున్నారు. నిఖార్సైన నటన అంటే ఏంటో రంగస్థలంపై చేసి చూపిస్తున్నారు. గిన్నిస్ రికార్డులకు ఎక్కిన వీరి ప్రతిభ చూసి తరించాల్సిందే. ఒకానొకప్పుడు ఈ నాటకం చూడడమే అదృష్టం అన్నట్టు వీరి వైభవం సాగింది. సురభి నాటక సంస్థకు 140 ఏళ్ల చరిత్ర ఉంది. కడప జిల్లాలోని సురభి గ్రామంలో స్థాపించారు.
ప్రదర్శనకు వెళ్లాలంటే రూ.3లక్షల ఖర్చు
ఎక్కడికై నా ప్రదర్శనకు వెళ్లాలంటే లారీతో తమ సెట్టింగు సామగ్రిని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ట్రాన్స్‌పోర్టు ఖర్చే రూ.2 నుంచి రూ.3లక్షలు ఖర్చు అవుతుందని చెపుతున్నారు. అందువల్ల కనీసం నాలుగైదు రోజులపాటు వారికి ఆ ప్రాంతంలో ప్రదర్శనలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది.
42 మందితో ప్రదర్శనకు
ఎక్కడకు ప్రదర్శనకు వెళ్లాలన్నా 42 మంది కుటుంబాలతోనే వెళతారు. అక్కడ వండుకోవడం కూడా వారే చేస్తూ.. వారి మేకప్ వారే వేసుకుంటారు. టెక్నికల్ వైర్ వర్క్‌లు, రథాలు, గుర్రాలు, బాణాలు వేయడం, వేదికపైనే మంటలు పుట్టించడం వంటి ఎన్నో రకాలు సాంకేతక పరిజ్ఞానం ద్వారా ప్రదర్శనలు చేస్తున్నారు. వీరికి పేరు తెచ్చిన నాటకాలు లవకుశ, మాయాబజార్.
చిన్నతనం నుంచే
నా చిన్నతనం నుంచే నాటక రంగు వేసుకుంటున్నాను. బాల ప్రహ్లాదుడిగా వేషం వేస్తున్నా. ఒక పక్క నాటకాలలో నటిస్తూ చదువుకుంటున్నా.
– ధవళిక సాయి, బాల కళాకారిణి
సురభి ఒక బ్రాండ్‌నేమ్
సురభి అనే మూడు అక్షరాలు ఒక బ్రాండ్‌గా మేము చెప్పుకుంటాం. ఎప్పటికీ శాశ్వతం. దానిపైనే మా బతుకులు సాగుతున్నాయి. చదువుకున్నా మళ్లీ నటించడానికి ఎక్కడ ఉన్నా ఇక్కడికే వస్తాం. – శాంతి, కళాకారిణి
మేకప్‌లు మేమే వేసుకుంటాం
మా మేకప్‌లు మేమే వేసుకుంటాం. పౌరాణిక, జానపద కథల ప్రదర్శనలు చే స్తాం. పాత్రకు తగ్గట్టుగా తయారై వస్తాం. హైదరాబాద్‌కు చెందిన సురభి వారి వినాయకా నాట్యమండలి పేరుతో ప్రస్తుతం నాటక ప్రదర్శనలు చేస్తున్నాం. ప్రభుత్వ సాయం అంతంతమాత్రమే.
– చంద్ర, సురభి కళాకారులు
మేకప్ అనంతరం ప్రదర్శనకు సిద్ధమవుతూ..
శ్రీకాకుళంలోని గుడివీధిలో నివాసం ఉండే మల్లాది వెంకటకృష్ణ శర్మ సురభి నాటక సమాజాలతో నెలల తరబడి తిరుగుతూ వారికి ఎన్నో నాటకాలు రాశారు. శ్రీకృష్ణలీలలు, మయాబజార్, లవకుశ, భక్త ప్రహ్లాద, వీరబ్రహ్మంగారి చరిత్ర సుమారుగా 20 కథలు రాశారు.
సు
సు
సు
సు
సు
సు
సు
సు


