గుడ్లు సరఫరాపై ఆరా
కొత్తూరు: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన గుడ్లు పంపిణీపై అధికారులు ఆరా తీశారు. గుడ్డు లేదు..ఓన్లీ ఫుడ్డే అనే శీర్షికతో గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు స్థానిక ఎంఈఓ–2 ఎన్.శ్రీనివాసరావు స్పందించారు. పాఠశాలకు గుడ్లు పంపిణీలో జరిగిన జాప్యంపై పలువురు హెచ్‌ఎంలను కారణాలు అడిగి తెలుసుకున్నారు. గుడ్లు పంపిణీలో జాప్యానికి గల కారణాలను పంపిణీదారు నుంచి తెలుసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుడ్లను సమీపంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అందజేనట్లు పంపిణీ దారుడు చెప్పి నట్లు ఎంఈఓ తెలిపారు. అదేవిధంగా గుడ్ల పంపిణీ జాప్యం పై డీఈఓ విచారణ చేసినట్లు తెలిసింది.
నేడు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ పర్యటన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) జనవరి 23న జిల్లాలో పర్యటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10.30 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, గురజాడ, విజయనగరం, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, శ్రీకాకుళానికి సంబంధించి జరుగుతాయన్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకాకుళం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కార్పొరేషన్, బొబ్బిలి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు సంబంధించి రెండు సమావేశాలు శ్రీకాకుళం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతాయని పేర్కొన్నారు.
జాతీయ పెన్‌కాక్ సిలాట్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
శ్రీకాకుళం న్యూకాలనీ: మూడో ఆలిండియా అంతర్ పాఠశాలల పెన్‌కాక్ సిలాట్ పోటీలకు జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్ వేదికగా జరగనున్నా యి. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి పావని, పూర్వి అవిక, సహస్ర, రుత్విక, రేణు, షణ్ముఖ్, షాన్‌పినిహాస్, సోహిత్, జస్వంత్, శివబాలాజీ, లోహిత్, అర్జున్, సాయి ప్రశాంత్, కిషన్‌ప్రేమ్, రోహిత్, ఎంపికై నవారిలో ఉన్నారు. ఈ పోటీల కోసం మరో రెండు రోజుల్లో ఇక్కడ నుంచి ఉత్తరాఖండ్ పయనమై వెళ్లనున్నారు. పోటీలకు క్రీడాకారులతోపాటు కోచ్‌లుగా ఎం.గౌతమి, వై.హేమంత్‌కుమార్, హరీష్, సామ గౌతమ్ కుమార్ వ్యవహరించనున్నారు.
గుడ్లు సరఫరాపై ఆరా


