ఆ టీచర్ మాకు వద్దు
నందిగాం: పిల్లలకు పాఠాలు చెప్పి వారిని తీర్చి ది ద్దాల్సిన టీచర్ విచక్షణ కోల్పోయిన వైఖరి నందిగాం వాసులను విస్తుగొలిపింది. విచక్షణ మరిచి విద్యార్థులను చితకబాదిన సంఘటన గురువారం నందిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. టెన్త్ పిల్లలకు ఉదయం 8 గంటలకు అదనపు క్లాస్ పెట్టారు. దీనిలో భాగంగా గురువా రం తెలుగు ఉపాధ్యాయుడు తాళాబత్తుల వరప్రసాద్ క్లాస్ తీసుకున్నారు. అయితే గ్రామంలో ఒక వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో కొంత మంది విద్యార్థులు 8.30 గంటలకు పాఠశాల ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న వరప్రసాద్ వారిని కర్రతో కొట్టడంతో విద్యార్థులు ఏడుపులు మొదలు పెట్టారు. ఆ గేటు బస్టాప్ పక్కనే ఉండడంతో అక్కడున్న వారు అడ్డుకున్నారు. దీంతో టీచర్ వారిని కూడా దూషించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు హెచ్‌ఎం హేమలతకు సమాచారం అందించారు. వారంతా వెళ్లి పరిశీలించగా విద్యార్థులను కొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. హెచ్‌ఎం ప్రశ్నించగా ఆ టీచర్ నిర్ల క్ష్యంగా సమాధానం ఇచ్చారు. తల్లిదండ్రులు ప్రశ్నించగా కుర్చీపై కూర్చుని పుష్ప సినిమా డైలాగులు చెప్పడం అందరినీ నివ్వెరపరిచింది. విలేకరులపై కూడా ఆయన చిందులు తొక్కాడు.
పరిస్థితి చేయి దాటిపోవడంతో డీఈఓకు సమాచారం అందించారు. దీంతో ఆయన టెక్కలి డిప్యూ టీ డీఈఓ విలియమ్స్‌ను పంపిగా ఆయనతో పాటు ఎంఈఓలు నర్సింహులు, చిన్నరావులు కూడా వచ్చి తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడి వారిని శాంతింపజేశారు. వారి వద్ద నుంచి స్టేట్‌మెంట్‌లు తీసుకొని ఉన్నతాధికారులకు నివేదిస్తానని డిప్యూటీ డీఈఓ తెలిపారు. విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుని మానసిక పరిస్థితి బాగోలేదని తోటి ఉపాధ్యాయులు చెబుతున్నారు. అలాంటి వ్యక్తి తమ పాఠశాలలో వద్దని, ఫిర్యాదు చేశామనే నెపంతో తమ పిల్లలపై తర్వాత కక్ష సాధిస్తాడని విద్యార్థుల తల్లిదండ్రులు డిప్యూటీ డీఈఓకు మొరపెట్టుకున్నా రు. ఇదే ఉపాధ్యాయుడు గత ఏడాది కూడా అప్పటి ప్రధానోపాధ్యాయుడు హరికృష్ణతో ఇలాగే గొడవ పడి నానా హంగామా చేశారు. అప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు సర్ది చెప్పి చర్యలు తీసుకోలేదు.
ఆలస్యంగా వచ్చారంటూ పదో తరగతి విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
ప్రశ్నించిన తల్లిదండ్రులకు పుష్ప సినిమా డైలాగ్ వినిపించిన టీచర్
మానసిక స్థితి బాగోలేందంటున్న తోటి ఉపాధ్యాయులు
ఆ టీచర్ మాకు వద్దు


