నిద్రమాత్రలతో..
గంజాయితో పోలీసులకు పట్టుబడటంతో యువకులు మెడికల్ షాపు ల్లోను, ఆస్పత్రుల్లోను దొరికే నిద్రమాత్రలను, సర్జికల్ స్పిరిట్‌ను గత కొద్దికాలంగా అధికంగా వినియోగిస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ తాజాగా సుమారు 22 విభాగాలతో జిల్లా కలెక్టరేట్‌లో గతేడాది చివర్లో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రత్యేక నిఘా పెట్టాల్సిందిగా అధికారులను హెచ్చరించారు. ఎవరైనా షాపుల వద్ద యువకులు కొంటే సమాచారం పోలీసులకు తెలిపేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 1451 మెడికల్ దుకాణాలుండగా అధిక శాతం వైద్యులు ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిద్రమాత్రలు, నొప్పి నివారణ మాత్రలను యథేచ్ఛగా విక్రయిస్తున్నట్లు సమాచారం ఉండటంతోనే ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించారు. సంబంధిత ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టడమే కాక కొన్నింటిపై చర్యలు తీసుకోవడానికి సంసిద్ధమయ్యారు.


