తిరుగు ప్రయాణికుల రద్దీ
శ్రీకాకుళం అర్బన్ :
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం తిరుగు ప్రయాణికులతో రద్దీగా కనిపించింది. సోమవారం నుంచి స్కూళ్లు, పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరుస్తుండడంతో విద్యార్థులు లగేజీలతో దూర ప్రాంతాలకు బయలుదేరేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవడంతో కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించింది. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నాన్ స్టాప్ కౌంటర్ వద్ద టికెట్ల కోసం బారులు తీరుతూ కనిపించారు. ముఖ్యంగా నాన్ స్టాప్ బస్సుల కోసం ఎక్కువ మంది వేచి ఉండడం కనిపించింది. దీంతో నాన్ స్టాప్ కౌంటర్ వద్ద ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉండడంతో ఆర్టీసీ అధికారులు పల్లె వెలుగు బస్సులను నాన్ స్టాప్ బస్సులుగా నడిపారు. నాన్ స్టాప్ బస్సులుగా పల్లె వెలుగులు నడపడంతో తమ ప్రయాణం సాఫీగా సాగిపోతే చాలనుకుని టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులు పల్లె వెలుగు బస్సులు ఎక్కి వెళ్లడం కనిపించింది. దీంతో పల్లె వెలుగు బస్సులు, నాన్ స్టాప్ బస్సులు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి.
నాన్ స్టాప్
కౌంటర్ వద్ద బారులు తీరిన ప్రయాణికులు
తిరుగు ప్రయాణికుల రద్దీ


