మేడపై నుంచి జారి పడి వ్యక్తి మృతి
గార: మేడపైనున్న ఆరిన దుస్తులు తీసుకువచ్చేందుకు వెళ్లి కళ్లుతిరిగి కింద పడిపోవడంతో తీవ్రగాయాలై చికిత్స పొందుతూ బందరువానిపేట గ్రామం దుమ్మువీధికి చెందిన కుందు శంకరరావు (70) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. 16వ తేదీ కనుమ పండగ రోజున మధ్యాహ్నం 4 గంటల సమయంలో తన ఇంటిపై మీదకి వెళ్లిన శంకరరావు కిందనున్న గచ్చుపై పడిపోవడంతో తలకి, వెన్నుపూసకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాహనం ద్వారా శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా శనివారం సాయంత్రం మృతి చెందినట్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు పోలారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు.


