ఉత్సవ సమయం
● నేటి నుంచి ఆదిత్యుని రథసప్తమి ఉత్సవాలు
● పూర్తి షెడ్యూల్ విడుదల
శ్రీకాకుళం కల్చరల్: సూర్య భగవానుడి జన్మదినోత్సవమైన రథసప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం ఆధ్యాత్మిక సాంస్కృతిక వేదికగా మారనుంది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆరు రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో ప్రతి రోజూ ప్రజలను అలరించేలా క్రీడలు, సాహసయాత్రలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలను ఖరారు చేశారు.
తొలి మూడు రోజులు (జనవరి 19, 20, 21)
● హెలీరైడ్స్: ప్రతిరోజూ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు డచ్ బిల్డింగ్ వేదికగా హెలీరైడ్స్ సాహసయాత్రలు నిర్వహించనున్నారు.
● క్రీడా సంబరాలు: ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ క్రీడా పోటీలు జరగనున్నాయి.
● వినోద కేంద్రం: ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు కేఆర్ స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్, కిడ్స్ ప్లే ఏరియా అమ్యూజ్‌మెంట్ పార్క్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి.
22న భక్తి, హాస్య జల్లులు
● ఉదయం 7 గంటలకు 80 ఫీట్ రోడ్డులో మెగా సూర్య నమస్కారాలు జరుగుతాయి.
● సాయంత్రం 5 గంటల నుంచి కేఆర్ స్టేడియంలో భారతి రమేష్ ఆర్కెస్ట్రా, శ్రీ సాయి శివ నృత్య కళా నికేతన్ ప్రదర్శనలు ఉంటాయి.
● దుంపల ఈశ్వరరావు శాసీ్త్రయ, జానపద సంగీతం, మావుడూరి బ్రదర్స్ మ్యూజికల్ షో అలరించనున్నాయి.
● రాత్రి 7 గంటల నుంచి పవన్ బ్యాండ్, మిమిక్రీ షోతో పాటు ప్రముఖ గాయకుడు గోరటి వెంకన్న గళం విప్పనున్నారు.
● జబర్దస్త్ టీమ్ (ఇమ్మాన్యుయేల్, నూకరాజు, రియాజ్, ఆసియా) కామెడీషో, బాణసంచా ప్రదర్శన ఉంటాయి.
23న శోభాయాత్ర – లేజర్ షో
● మధ్యాహ్నం 2 గంటల నుంచి డే అండ్ నైట్ జంక్షన్ నుంచి అరసవల్లి వరకు కన్నుల పండువగా శోభాయాత్ర సాగనుంది.
● సాయంత్రం 5 గంటల నుంచి రాజు బ్రదర్స్ సాక్సోఫోన్, నీరజ సుబ్రహ్మణ్యం శాసీ్త్రయ నృత్యం, ఆరోహి మ్యూజికల్ అకాడమీ షోలు ఉంటాయి.
● రాత్రి 7 గంటల నుంచి జబర్దస్త్ రామ్ ప్రసాద్ టీమ్ కామెడీ, యాంకర్ సౌమ్య రావు నిర్వహణలో ఖన్నా మాస్టర్ ‘ఢీ–డాన్సర్స్’ బృందం నృత్యాలు ఉంటాయి.
● పల్సర్ బైక్ రమణ బృందం జానపద గీతాల సందడితో పాటు లేజర్ షో నిర్వహించనున్నారు.
● 24న ముగింపు వేడుకల్లో సంగీత దర్శకుడు థమన్ లైవ్ కాన్సర్ట్.
● చివరి రోజు సాయంత్రం సెలబ్రిటీలు అక్ష ఖాన్, మణికంఠ, తేజస్వినిల ప్రదర్శనలు, తన్మయి శాసీ్త్రయ నృత్యం, గణపతి శర్మ యామిని ల మ్యూజికల్ షోలు ఉంటాయి.
● రాత్రి 7 నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్ కాన్సర్ట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు ఆది ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, యాంకర్లుగా సాయికుమార్, చంద్రికలు సందడి చేయనున్నారు.
● అదేరోజు అర్ధరాత్రి నుంచి సూర్య భగవానుడి నిజరూప దర్శన భాగ్యాన్ని భక్తులకు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
ఉత్సవ సమయం
ఉత్సవ సమయం


