ఆటో, బైక్ ఢీ .. వ్యక్తికి తీవ్రగాయాలు
పాతపట్నం: మండలంలోని బగదల గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో, ద్విచక్రవాహనం ఢీ కొని ఓ వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగుపురం నుంచి ధనుపురం వస్తున్న ఆటో, ధనుపురం నుంచి బగదల వస్తున్న ద్విచక్రవాహనం బగదల గ్రామ సమీపానికి వచ్చే సరికి ఎదురెదురుగా ఢీ కొని, ద్విచక్రవాహనంపై వస్తున్న బగదల గ్రామానికి చెందిన మాలువ రాముకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించగా, 108 ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని పాతపట్నం సీహెచ్‌సీకి తరలించారు.


