వలస.. దశాబ్దాలుగా సిక్కోలు గుండె మోస్తున్న భారమిది. పసి
కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ మజ్జి(23) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నాడు. కుటుంబ బాధ్యత ను భుజానికెత్తుకున్నాడు. తల్లి మాట ప్రకారం ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి రెండే ళ్లు గడువు పెట్టి స్నేహితుడితో కలసి 2024 మార్చి లో దుబాయ్ వెళ్లాడు. ఆగస్టు 28న కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు స్వగ్రామానికి సమాచారం అందడంతో కుటుంబమంతా హతాశుతులయ్యారు. వారం రోజుల తర్వాత మృత దేహం గ్రామానికి చేరుకుంది. నేటికి 16 నెలలు కావస్తున్నా ఆ కంపెనీ నుంచి నయా పైసా తన చేతికి అందలేదని మృతుడి తల్లి ఊర్మిళ మజ్జి ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు ఉరఫ్ చంటి(22) ఏడాదిన్నర కిందట జీవనోపాధి కోసం అబుదాబికి వెల్డింగ్ హెల్పర్‌గా వెళ్లాడు. మీ కుమారుడు చంటి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ ఈ ఏడాది నవంబర్ 25న ఫోన్‌లో సమాచారం అందివ్వడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి దండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసి వా రం రోజుల్లో మృతదేహాన్ని డొంకూరు పంపించా రు. కంపెనీ నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.
వలస.. దశాబ్దాలుగా సిక్కోలు గుండె మోస్తున్న భారమిది. పసి
వలస.. దశాబ్దాలుగా సిక్కోలు గుండె మోస్తున్న భారమిది. పసి


