25న జిల్లాస్థాయి హిందీ ప్రతిభా పరీక్ష
శ్రీకాకుళం కల్చరల్: హిందీ సేవా సదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పాఠశాల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్‌లో జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికై న విద్యార్థుల వివరాలను విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు గురువారం విడుద ల చేశారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మల్లేశ్వరరావు మా ట్లాడుతూ హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో మొదటిసారిగా హిందీ భాష పట్ల అభిరుచి పెంచేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు తెఇపారు. జిల్లా స్థాయి పోటీకి ఎంపికై న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మంచ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోనే శ్రీధర్ మాట్లాడుతూ హిందీ మంచ్ సంస్థ సమన్వయంతో ఉత్తరాంధ్రలో 2,300 మందికిపైగా విద్యార్థులు పాఠశాల స్థాయి ప్రతిభా పోటీ లో పాల్గొన్నారని వివరించారు. వీరిలో 150 మంది పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచి జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లాస్థా యి ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నామని పేర్కొ న్నారు. హిందీ పండిట్లు రొంపివలస రామారావు, బి.మంజుల, కనుగుల సత్యం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ పోలుమహంతి జగన్మోహనరావు, విశ్రాంత సెట్‌శ్రీ సీఈవో సురంగి మోహనరావు, బలివాడ మల్లేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో మంచ్ జోనల్ కమిటీ ప్రతినిధి ఎం. వి.మల్లేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం, జిల్లాశాఖ ప్రతినిధులు కనుగుల సత్యం, రొంపివలస రామారావు, ఈరంకి ఉమారా ణి, సింగూరు రాధ, శిరీష, సత్యనారాయణ, విజయ్, తంగివానిపేట హైస్కూల్ హెచ్‌ఎం రామకృష్ణ, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


