అమ్మకానికి ‘ ఆంధ్రప్రదేశ్ ’
వైఎస్సార్ సీపీ కంటే ఎక్కు వ పథకాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు జనాలను మోసం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోంది. పేదలంటే చంద్రబాబుకు ఎప్పుడూ పడదు. రైతుకు బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోయారు. గిట్టుబాటు ధర కూడా లభించడం లేదు. ఐదేళ్ల పాలనలో రూ.3.30 లక్షల కోట్ల అప్పు విధ్వంసమా.. ఏడాదిన్నరలో రూ.2.66 లక్షల కోట్లు విధ్వంసమా. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారుచేసి చివరికి అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పథకమే అమలు చేస్తున్నారు.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
వైఎస్సార్‌సీపీ హయాంలో రామరాజ్యం
ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్ పాలన సాగించారు. ఆయన హయాంలో రామరాజ్యాన్ని స్థాపించారు. కులమతాలకు అతీతంగా పథకాలు ఇచ్చారు. అబద్ధాలు నమ్మి ప్రజలు మంచి పాలనను దూరం చేసుకున్నారు. మళ్లీ ఆ రాజ్యాన్ని తెచ్చుకుందాం.
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే
ఇది దోపిడీ ప్రభుత్వం
చంద్రబాబుకు తెలిసిందంతా దోపిడీయే. మంత్రి అచ్చెన్నాయుడు రైతుల సమస్యలు గాలికి వదిలేసి మిల్లర్లు, గ్రానైట్, పాలిషింగ్ యూనిట్ల వద్ద దోపిడీ చేస్తున్నారు. – పేరాడ తిలక్, వైఎస్సార్‌సీపీ టెక్కలి సమన్వయకర్త
అమ్మకానికి ‘ ఆంధ్రప్రదేశ్ ’
అమ్మకానికి ‘ ఆంధ్రప్రదేశ్ ’
అమ్మకానికి ‘ ఆంధ్రప్రదేశ్ ’


