కబడ్డీలో రన్నర్‌గా రిమ్స్ జట్టు
శ్రీకాకుళం: స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్) కబడ్డీ జట్టు డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో జరిగిన 27వ ఇంటర్ కళాశాలల క్రీడా టోర్నమెంట్–2025లో అద్భుత ప్రదర్శన కనబరిచి రన్నరప్‌గా నిలిచింది.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. జట్టు విజయం సాధించడానికి కృషి చేసిన ప్రిన్సిపాల్ డా.ఎస్.అప్పల నాయుడు, ఫిజికల్ డైరెక్టర్ డా.బి.గౌరి నాయుడు, అలాగే క్రీడా మండలి సభ్యులైన డా.ఎల్.ప్రసన్న కుమార్, డా.ఎస్.నరసింహమూర్తిలను కళాశాల బృందం అభినందించింది.


