ఇది రాజ్యాంగ ఉల్లంఘన
పేదల కోసం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు నిర్మించతలపెడితే పీపీపీ ముసుగులో చంద్రబాబు ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలనుకోవడం దుర్మార్గం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజలకు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలిస్తే ఉద్యమాలే శరణ్యమవుతాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడమంటే పేద ప్రజల ఆరోగ్యాన్ని అమ్మేయడమే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణ ఉద్యమంలా నిర్వహించాం. అన్నీ ప్రైవేటు చేతికి వెళ్తే పేదవాడికి అనారోగ్యం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ఇసుక, మట్టి, నీరు, గాలి అప్పనంగా అమ్మేసి దోపిడీ చేయడమే కూటమి పాలన. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయి.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
రెడ్‌బుక్ రాజ్యాంగం
ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు చూశాక వైఎస్ జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు మాత్రం తన వాళ్లు బాగుపడితే చాలు రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదనే ధోరణిలో ఉన్నారు. ఇటీవల జరిపిన సర్వేలోనూ 80 శాతం కూటమి ఎమ్మెల్యేలు రెడ్‌జోన్‌లో ఉన్నట్లు తేలింది. రాజధాని తప్పితే చంద్రబాబుకు మరేమీ పట్టడం లేదు.
– ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు


