● అడుగడుగునా అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

● అడుగడుగునా అడ్డంకులు

Dec 16 2025 4:18 AM | Updated on Dec 16 2025 4:18 AM

● అడు

● అడుగడుగునా అడ్డంకులు

● పాతపట్నం నుంచి వాహనాలతో వచ్చిన నాయకులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కోటి సంతకాలు గర్జించాయి. అశేష జన ర్యా లీ మధ్య కోటి సంతకాల ప్రతుల వాహనం తాడేపల్లికి బయల్దేరింది. ప్రభుత్వం కుట్రలు పన్నినా, పోలీసులు నిర్బంఽధించినా, ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆంక్షలు పెట్టినా, టోల్‌గేట్ల వద్ద అడ్డు కున్నా వైఎస్సార్‌ సీపీ శ్రేణులు వెనక్కి తగ్గలేదు. ఎంత అణగదొక్కితే అంత పైకి లేస్తామన్నట్టుగా అంతే కసితో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జిల్లాలో 4 లక్షలకు పైగా సేకరించిన కోటి సంతకాల పత్రాలు విజయవాడ తరలి వెళ్లాయి. శ్రీకాకుళంలోని టౌన్‌ హాల్‌ వద్ద సంతకాల పత్రాల వాహనాన్ని నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. దానికి ముందు నాయకులంతా జెండాలు, ప్లకార్డు లు పట్టుకుని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పెద్ద మార్కెట్‌ వద్ద పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి, నిలువరించేందుకు యత్నించారు. కానీ ప్రజాగ్రహాన్ని నిలువరించలేకపోయారు. పార్టీ శ్రేణులంతా ముందుకు తోసుకుని వెళ్లాయి. దీంతో కాసేపు తో పులాట చోటు చేసుకుంది. అక్కడి నుంచి భారీ ర్యాలీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం మీదు గా ఏడు రోడ్ల కూడలికి చేరుకుంది. అక్కడి నుంచి పాతబ్రిడ్జి, నవభారత్‌ జంక్షన్‌ మీదుగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయానికి కోటి సంతకాల ప్రతుల వాహనం వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలతో ర్యాలీ దద్దరిల్లిపోయింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు టౌన్‌ హాల్‌లో భారీ సమావేశం జరిగింది. చంద్రబాబు తప్పుడు విధానాలను నాయకులు కడిగిపారేశారు.

ప్రభుత్వ కుట్రలు.. పోలీసుల ఆంక్షలు

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా నడుస్తుండటం, ప్రజ ల్లో అనూహ్య స్పందన రావడాన్ని చూసి తట్టు కో లేక ప్రభుత్వం కుట్రలకు దిగింది. ఆదివారం రాత్రే ఆ కుట్రలకు పదును పెట్టింది. పోలీసులకు బాస్‌ల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇంకేముంది వాటిని ఆచరణలో పెట్టేందుకు జిల్లా పోలీసు వర్గాలు రంగంలోకి దిగాయి. ఆదివారం రాత్రే సెట్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి, కోటి సంతకాల ప్రజా ఉద్యమంపై ఉక్కు పాదం మోపాలని ఆదేశించాయి. ఎక్కడికక్కడ నిలువరించకపోతే ఇబ్బందులు పడతారని క్షేత్ర స్థాయి అధికారులను హెచ్చరించాయి. దీంతో శ్రీకాకుళంలో జరిగే ప్రజా ఉద్యమం భారీ ర్యాలీకి వెళ్లొద్దని పోలీసుల నుంచి హెచ్చరికలు వచ్చాయి. సోమవారం ఉదయం కార్యరూపం దాల్చాయి. నియోజకవర్గాలు, మండల కేంద్రాలు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై శ్రీకాకుళం వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్‌, ఆమదాలవలస నియోజక వర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌, మామిడి శ్రీకాంత్‌, అంధవరపు సూరిబాబు, ఆరంగి మురళి, దుంపల లక్ష్మణరావు, శాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, గొండు కృష్ణమూర్తి, చల్ల రవి, ఎంవీ పద్మావతి, కరిమి రాజేశ్వరరావు, పిరియా సాయిరాజ్‌ పాల్గొన్నారు.

శ్రీకాకుళం టౌన్‌హాల్‌ నుంచి ఏడురోడ్లు కూడలివరకు ర్యాలీగా వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు

నిర్బంధాలు ఎందుకు.?

ప్రశ్నించేవారిని నిర్బంధించాలనుకుంటే ఊరుకునేవారు ఎవరూ లేరు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు. ఏడాదిన్నర పాలనలో రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేశారు. అందులో రూ.5వేల కోట్లు కేటాయిస్తే మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. గిట్టుబాటు లేక రైతులు కన్నీరు పెడుతున్నారు. చంద్రబాబు సర్కారును గద్దె దింపే రోజులు దగ్గరపడ్డాయి.

– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్‌

ఎందుకంత నిర్లక్ష్యం..?

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా నిర్మించారా..? ఐదేళ్ల పాలనలోనే వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలు తీసుకువచ్చారు. పేదల ఆరోగ్యమన్నా, పేదోడికి వైద్యమన్నా చంద్రబాబుకి ఎందుకంత నిర్లక్ష్యమో. టీడీపీ హయాంలో ఖర్చు ప్రభుత్వానికి ఆదాయం ప్రైవేటువారికి దక్కుతోంది. చంద్రబాబు ఏడాదిన్నర పాలనలో రూ.2.66లక్షల కోట్లు అప్పుచేయడం విడ్డూరం.

– కుంభా రవిబాబు, వైఎస్సార్‌ సీపీ

పార్లమెంటరీ పరిశీలకుడు, ఎమ్మెల్సీ

విద్య మన హక్కు

విద్య రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చంద్రబాబు ప్రభు త్వం దాన్ని గాలికి వదిలేసింది. మెడికల్‌ కాలేజీలు ప్రైవేటుపరం చేసి వైద్యవిద్య సీట్లు కోట్లాది రూపాయలకు అమ్ముకోవడం అన్యాయం.

– పిరియా విజయ, జెడ్పీ చైర్‌ పర్సన్‌

యజ్ఞంలా కోటి సంతకాలు

కోటి సంతకాల కార్య క్ర మం యజ్ఞంలా సాగింది. జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది సంతకాలు చేశారు.

– గొర్లె కిరణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే

మాజీ మంత్రి సీది రి అప్పలరాజు తదితర నాయకులను జాతీయ రహదారిపై పోలీసు వాహనా లు అడ్డంగా పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనాల్లో ఉన్న వారందరూ దిగిపోయి వెనక్కి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్సార్‌సీపీ నాయకుల వాహనాలతో పాటు మిగతా వాహనాలను అడ్డుకున్నారు.

ఇచ్ఛాపురంలో జాతీయ రహదారిపైకి వైఎస్సార్‌సీపీ నాయకుల వాహనా లు రాగానే పోలీ సులు అడ్డుకున్నారు. ముఖ్యంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజ య, మరికొందరి నాయకులను నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. పిరియా విజయ ఎంత నచ్చ చెప్పినా పోలీసులు వినలేదు. తాము చెప్పినట్టే వ్యవహరించాలని పట్టుబట్టారు. అయితే, వైఎస్సార్‌సీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పట్టుదలతో శ్రీకాకుళం చేరుకున్నారు.

టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌ తదితరులు వస్తున్న వాహనాలను మడపాం టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుత మార్గంలో వెళ్తుంటే అడ్డకోవడమేంటని తిలక్‌ పోలీసులను ప్రశ్నించారు. కానీ, పోలీసులు అంగీకరించలేదు. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టోల్‌గేట్‌ వద్దే నిరసన తెలియజేశారు.

ఆమదాలవలసలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న దశలో పార్టీ సమన్వయ కర్త చింతా డ రవికుమార్‌తో పాటు నాయకులను పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని శ్రీకాకుళం వస్తుండగా కొత్తరోడ్డు జంక్షన్‌ వద్ద, సెవెన్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద మళ్లీ అడ్డుకున్నారు. కొత్తరోడ్డు వద్ద పోలీసులకు, వైఎస్సార్‌ సీపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

నరసన్నపేట నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం వెళ్లే వైఎస్సార్‌సీపీ నాయ కుల వాహనాలను కూడా మడపాం టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్నా రు. అలాగే, ధర్మాన కృష్ణచైతన్య, వారి నాయకులు, కార్యకర్తలతో కార్లు, ద్విచక్ర వాహనాలతో శ్రీకాకుళం చేరుకున్న క్రమంలో అరసవిల్లి జంక్షన్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కృష్ణచైతన్య మధ్య 30నిమిషాలు వాగ్వాదం చోటు చేసుకుంది. డీఎస్పీ వివేకానంద అక్కడికొచ్చి, సర్దిచెప్పి వాహనాలను 80 అడుగుల రోడ్డులో పార్కింగ్‌ చేయించి, కాలి నడకన టౌన్‌ హాల్‌ దగ్గరకు వెళ్లేందుకు అనుమతించారు.

● అడుగడుగునా అడ్డంకులు 1
1/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 2
2/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 3
3/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 4
4/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 5
5/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 6
6/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 7
7/8

● అడుగడుగునా అడ్డంకులు

● అడుగడుగునా అడ్డంకులు 8
8/8

● అడుగడుగునా అడ్డంకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement