
ఎరువులపై సమాచారం కోసం కంట్రోల్ రూమ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల సరఫరా, వినియోగంపై కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నియంత్రణ విభాగంలో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ స్వామి తెలిపారు. ఎరువుల లభ్యతపై లేదా ఇతర సంబంధిత సమాచారం కోసం రైతులు 9121863788 నంబరుకు సంప్రదించవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడినంత ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అవసరానికి మించి ఎరువులను వినియోగించే విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.