ఆర్టీసీ బస్టాండ్‌లలో షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లాలో గల ఆర్టీసీ బస్ స్టేషన్లలో షాపులకు దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం 1, 2వ డిపోలు, టెక్కలి, పలాస తదితర డిపోల పరిధిలోకి వచ్చే ఆర్టీసీ బస్ స్టేషన్ల పరిధిలోని 66 షాపులలో అనుమతించిన వ్యాపా రం నిర్వహించేందుకు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు టెండర్ ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీలోగా శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం 1, 2వ ఆర్టీసీ డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపో మేనేజర్ల కార్యాలయాలలో టెండరు ఫారాలు అన్నీ పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా కొనుగోలు చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలలోపు టెండర్ ఫారాలను టెండరు బాక్స్ లో వేయాలని, మధ్యాహ్నం 3 గంటలకు టెండరు దారుల సమక్షంలో బాక్సులను తెరుస్తారని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.


