మాది పొందూరు మండలం కనిమెట్ట. మా నాన్న అప్పయ్య ఫ్రీడమ్ ఫైటర్ కావడంతో ఎచ్చెర్ల మండలం ముద్దాడలో 198/2 సర్వే నంబరులో ఐదెకరాల భూమిని ప్రభుత్వం ఇచ్చింది. ఆ భూమికి పక్కనే వేరే వాళ్లకు స్థలం ఇచ్చారు. సర్వే సిబ్బంది సరిగా కొలవక ఎకరా భూమిని వారికే అప్పజెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో మా నాన్న పేరుతో ఐదెకరాలు చూపిస్తున్నా ఫిజికల్‌గా నాలుగే ఉంది. ఇప్పటికి ఐదారుసార్లు కలెక్టర్ పీజీఆర్‌ఎస్ (గ్రీవెన్స్)లో ఫిర్యాదు చేశా. చివరికి పీజీఆర్‌ఎస్ అండార్స్‌మెంట్‌లో హద్దులు చూసేందుకు వీలుపడలేదు అని నాకు పంపించారు. సమస్యలు తీర్చనప్పుడు మరెందుకుంది పీజీఆర్‌ఎస్.
– కేవీ నర్సింహం, రిటైర్డ్ ప్రిన్సిపాల్, కనిమెట్ట,
పొందూరు మండలం
ప్రభుత్వ భూమి ఆక్రమణ
లావేరు మండలంలోని తామాడ గ్రామంలో సర్వే నంబరు 105, 113లో 1, 2, 3, 7 సర్వే నంబర్లలో గల సుమారు 4 నుంచి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ముళ్ల సాయి అనే వ్యక్తి ఆక్రమించుకుని చదును చేసేశారు. ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుందే తప్ప ప్రశ్నించడం లేదు. ఈ భూమిలోనే చిన్న గెడ్డ కూడా ఉంది. ఆక్రమణ వల్ల గెడ్డ మూసివేతకు గురైంది. తక్షణమే అధికారులు, రెవెన్యూ యంత్రాంగం స్పందించి ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలి.
– రౌతు నారాయణరావు, లావేరు మండలం, తామాడ గ్రామం
పెన్షన్ కోసం..
నా వయసు 55. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకమ్మాయికి పెళ్లి అయిపోయింది. మరో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. నాకు ప్రమాదం జరిగి 6 నెలలు అవుతోంది. ప్రమాదంలో చెయ్యి, కాలు దెబ్బతిన్నాయి. ఎక్కడికీ వెళ్లి పనిచేయలేని పరిస్థితి నెలకొనడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. పెన్షన్ కోసం ఊరిలో ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయాను. గ్రీవెన్స్‌లో అయినా ఫిర్యాదు చేస్తే వికలాంగ పెన్షన్ మంజూరు చేస్తారనే ఆశతో వచ్చాను.
– ఎస్.అప్పారావు,
రణస్థలం మండలం, సీతంవలస
●
ఎందుకీ పీజీఆర్‌ఎస్..