జలుమూరులో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్న వైద్య బృందాలు
జలుమూరు, బూర్జ: ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఒక వైపు ఆరోగ్యశ్రీ, మరోవైపు ఫ్యామిలీ డాక్టర్ వైద్యం అందిస్తూనే జగనన్న ఆరోగ్య సురక్ష పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఇంటింటా సర్వే ముమ్మరంగా జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఈ సర్వే పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ముగ్గురు పర్యవేక్షణ అధికారులను కూడా నియమించింది. దీనికి తోడు నియోజకవర్గాలకు కూడా వైద్యాధికారులను పర్యవేక్షణ కోసం ప్రభుత్వం నియమించింది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.
మండలాల్లో వైద్యశిబిరాలు..
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మండలాల వారీగా ఈ నెల 30 నుంచి మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి శిబిరంలో ఇద్దరు వైద్యులు ఉంటారు. వీరితోపాటు 104 వైద్యులు అందుబాటులో ఉంటారు. ఒక మండలంలో ఎన్ని హెల్త్ క్లినిక్స్ ఉన్నాయో ఆ పరిధిలో గుర్తించిన రోగులందరికీ ఆ రోజు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందజేస్తారు. హెల్త్ శిబిరాల నిర్వహణలో ఎంపీడీఓ, తహసీల్దార్‌తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొంటారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు జబ్బులకు గుర్తించడం ఒక పనయితే, వారికి చికిత్స చేసేందుకు రిఫరల్ చే యడం రెండో అంశం. ఈ రెండు అంశాలే కీలకం. దీనికి తోడు ఈ శిబిరాల్లో దీర్ఘకాలిక వ్యాధులైన షుగర్, కేన్సర్, గుండె, కిడ్నీ, బీపీ వంటి సమస్యలకు చికిత్స అందజేస్తారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. సర్వేలో ఆరోగ్య కార్యకర్త, కమ్యూనిటీ హెల్త్ ఆధికారి సంయుక్తంగా గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ జరిగితే ఆ రోగికి ఒక ఐడీ నంబర్‌తోపాటు కేస్ షీటు ఇస్తారు. ఆ వ్యాధి సంబంధిత స్పెషలిస్టు వద్ద వైద్యం తీసుకోవచ్చు.
జిల్లా అధికారులు వీరే..
జిల్లా అధికారులుగా డీఎంహెచ్‌ఓ బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ టీబీ అధికారి అనురాధ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఆర్‌వీఎస్ కుమార్‌లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.
నియోజకవర్గాలకు..
ఇచ్ఛాపురం: డాక్టర్ పి.శ్రీదేవి
పలాస: డాక్టర్ జీవీ లక్ష్మి
టెక్కలి: డాక్టర్ ఎం.ప్రసాదరావు
పాతపట్నం: డాక్టర్ పీవీ సత్యనారాయణ
అర్బన్ హెల్త్ సెంటర్లు(శ్రీకాకుళం,
ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం) :
డాక్టర్ పి.వి లింగరాజు
ఆమదాలవలస: జి.సన్యాసిరావు
ఎచ్చెర్ల: కె.రవి ప్రసాద్
నరసన్నపేట: డాక్టర్ ప్రవీణ్
శ్రీకాకుళం: శ్రీనివాసరావు
వీరితో పాటు మండలాల్లో జగనన్న సురక్ష కార్యక్రమం పర్యవేక్షణ చేసేందుకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సీనియర్ వైద్యులను 30 మండలాలకు 30 మందిని నియమించారు. వీరు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి రోజువా రీ నివేదికలను తెప్పించుకుని జిల్లా వైద్యాధికారితో సమన్వయం చేసుకుంటారు.
జగనన్న ఆరోగ్య సురక్షలో ఇంటింటా ముమ్మర సర్వే
జిల్లాకు ముగ్గురు పర్యవేక్షణ అధికారులు
వైద్యారోగ్య శాఖలో చరిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం
చరిత్రాత్మక కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శా ఖ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. గతంలో సాధారణంగా వైద్య శిబిరాలు మాత్రమే నిర్వహించేవారు. ఈ సారి మాత్రం వైద్య శిబిరాలకు 15 రో జులు ముందుగానే ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి అర్హులైన వారికి నెట్‌వర్క్ ఆస్పత్రులతోపాటు స్పెషలిస్ట్ వైద్యులను కోరుకునే ప్రత్యేక అవకాశం కల్పించడం జరుగుతుంది. – బి.మీనాక్షి, డీఎంహెచ్‌ఓ


