మోగిన స్థానిక నగారా | - | Sakshi
Sakshi News home page

మోగిన స్థానిక నగారా

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

రైల్వే ఉద్యోగులకు దసరా బోనస్‌

గుంతకల్లు: గుంతకల్లు రైల్వే డివిజన్‌లోని నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు దసరా బోనస్‌ మంజూరు చేసినట్లు బుధవారం రైల్వే డివిజన్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సీలింగ్‌ పరిమితి రూ.7 వేల వేతన ప్రాతిపదికగా 78 రోజుల కాలానికి లెక్కించి ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్‌గా అందజేయనున్నారు. డివిజన్‌ వ్యాప్తంగా 14,300 మందికిపైగా ఉద్యోగులకు దసరా బోనస్‌ అందుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా వేతన సీలింగ్‌ పరిమితి (రూ.7000) 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి మార్పు లేకుండా కొనసాగుతుండటంపై రైల్వే ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రశాంతి నిలయం: స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా మున్సిపల్‌, మండల, జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. మొత్తంగా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటించారు. తొలుత మున్సిపల్‌ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్‌ ఎన్నికలు, చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌ రూపొందించారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు, 32 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్‌, జెడ్పీటీసీలు, ఎంపీపీలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

16 నుంచి నామినేషన్ల స్వీకరణ..

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదట నిర్వహించే మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి మున్సిపాలిటీలతో పాటు మడకశిర, పెనుకొండ నగర పంచాయతీల్లో ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో నామినేషన్ల పరిశీలన, 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 28వ తేదీన పోలింగ్‌, 30వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నవంబర్‌ 3న ఎంపీటీసీ,

జెడ్పీటీసీ ఎన్నికలు...

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్‌ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ఉంటుంది. నవంబర్‌ 5న ఫలితాలు వెల్లడించనున్నారు.

మూడు దశల్లో పంచాయతీ ఎన్నిక లు

జిల్లాలో 467 గ్రామ పంచాయతీలు ఉండగా..మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు. నవంబర్‌ 13న తొలి దశ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌, నవంబర్‌ 26న తొలి విడత పోలింగ్‌, అదే రోజు ఫలితాల వెల్లడి ఉంటుందన్నారు. నవంబర్‌ 16వ తేదీన రెండో దశ పంచాయతీల్లో నిర్వహించే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌, నవంబర్‌ 29న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. మూడో దశ పంచాయతీలకు నవంబర్‌ 19న నోటిఫికేషన్‌, డిసెంబర్‌ 2న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు వెల్లడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వెల్లడించారు.

సమష్టిగా పనిచేద్దాం...విజయవంతం చేద్దాం: కలెక్టర్‌

స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి శ్యాం ప్రసాద్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిమిత సమయంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అధికారులందరూ సిద్ధం కావాలన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తాము నిర్వహించాల్సిన విధులపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎన్నికల ముందు చేపట్టాల్సిన ఏర్పాట్లు, పోలింగ్‌ సమయంలో అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల అనంతరం పూర్తి చేయాల్సిన ప్రక్రియలపై అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అధికారులందరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ కొండయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డీపీఓ వెంకటరత్నం, ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహసీల్దార్లు, ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బుధవారం నుంచే అమల్లోకి ఎన్నికల కోడ్‌

మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ

తొలుత మున్సిపల్‌, తర్వాత ఎంపీటీసీ,

జెడ్పీటీసీ ఎన్నికలు

చివరగా పంచాయతీ ఎన్నికల నిర్వహణ

రేపటి నుంచి 18వ తేదీ వరకూ

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లస్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement