పత్రమివ్వరు.. పత్తాలేరు! | - | Sakshi
Sakshi News home page

పత్రమివ్వరు.. పత్తాలేరు!

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

హిందూపురం(చిలమత్తూరు): స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాల కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వైఎస్సార్‌సీపీ మద్దతు దారులకు ఇంతవరకూ పత్రాలు మంజూరు చేయలేదు. బుధవారం నోటిఫికేషన్‌ కూడా రావడంతో పలువురు అభ్యర్థులు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా అధికారులెవరూ అందుబాటులో లేరు. దీంతో వారంతా కార్యాలయం ఎదుటే నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ కురుబ విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ఏ శివ మాట్లాడుతూ.. అధికారులు అందుబాటులో లేకుండా పోతే ధ్రువీకరణ పత్రాలు ఎవరిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయకుండా దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, కట్ల బాషా, అసిఫుల్లా, జబీఉల్లా, వాల్మీకి లోకేష్‌, నాగరాజు, శంకరయ్య, అయూబ్‌ బేగ్‌, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను

ఇబ్బందులు పెడుతున్న అధికారులు

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల

మంజూరులో తీవ్ర జాప్యం

బుధవారం మధ్యాహ్నం నుంచే

పత్తాలేని తహసీల్దార్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement