లోకకళ్యాణార్థం ‘సప్తాహ జ్ఞాన యజ్ఞం’ | - | Sakshi
Sakshi News home page

లోకకళ్యాణార్థం ‘సప్తాహ జ్ఞాన యజ్ఞం’

Oct 15 2026 11:35 AM | Updated on Oct 15 2026 11:35 AM

ప్రశాంతి నిలయం: విశ్వశాంతి, లోకక్షేమం కోసం ప్రశాంతి నిలయంలో వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద భజన మందిరంలో తొలుత రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి వేదమంత్రోచ్ఛారణ, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశాన్ని ఊరేగింపుగా పూర్చచంద్ర ఆడిటోరియానికి తీసుకొచ్చారు. ప్రత్యేక హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన చేసి, పవిత్ర కాష్టాలను మధించి అగ్నిని అవాహన చేసి యజ్ఞకుండంలో ప్రతిష్టించారు. అనంతరం వేదపండితులు రుద్ర హోమంతో అగ్నికి అహుతులను సమర్పించారు. సర్వలోక శాంతి, సౌభ్రాతృత్వం, సమస్త జీవరాశి సంక్షేమం కోసం ప్రార్థనలు నిర్వహించారు. వేదమంత్రాలతో ఆడిలోరియం మార్మోగింది. ఈ కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ రాజు, జిల్లా కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌, సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

అలరించిన సంగీత విభావరి..

దసరా వేడుకలలో భాగంగా బుధవారం సాయంత్రం సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్‌ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల నందగిరి క్యాంపస్‌ విద్యార్థులు వేదంలో వేడుకలు ప్రారంభించారు. ప్రశాంతి విద్వాన్‌ మహాసభలో భాగంగా సత్యసాయి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ భాషా విభాగం అధిపతి డాక్టర్‌ మైథాలి ఖన్నా దసరా వేడుకల వైభవం, ఆధ్యాత్మికత అనే అంశాలపై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులు స్వరాంభిక పేరుతో నిర్వహించిన సంగీత విభావరి భక్తులను అలరించింది.

వేదమంత్రాలతో మార్మోగిన

పూర్ణచంద్ర ఆడిటోరియం

వేలాదిగా పాల్గొన్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement