సమస్య తెల్లకాగితంపై రాసి పంపినా పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

సమస్య తెల్లకాగితంపై రాసి పంపినా పరిష్కారం

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

● జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌

గాండ్లపెంట: ప్రజలు సమస్యలను తెల్లకాగితంపై రాసి పంపినా లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కారం దొరుకుతుందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.రాజశేఖర్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని వేపరాల పంచాయతీ తాళ్లకాల్వ గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌ ద్వారా ఉచిత న్యాయసేవలపై అవగాహన కల్పించడానికి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో బుద్ధిమాంద్యపు పిల్లలను సంరక్షిస్తున్న మహిళను ఆదుకునేందుకు నివేదిక ఇవ్వాలని వలంటీర్లను ఆదేశించారు.సదస్సులో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లింగాల లోకేశ్వరరెడ్డి, న్యాయవాదులు కదిరి నరసింహులు, షర్ఫొద్దీన్‌, రఘనాథ్‌ , వైద్యాధికారి బాబా ఫకృద్ధీన్‌, ఎంఈఓ శ్రీనివాసులు, సీడీపీఓ నిహారిక, రెడ్స్‌ సంస్థ అధ్యక్షురాలు భానుజా, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement