రెచ్చిపోతున్న మట్టి మాయగాళ్లు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న మట్టి మాయగాళ్లు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

నల్లచెరువు: మండలంలో మట్టిమాఫియా రెచ్చిపోతోంది. మట్టి అక్రమ రవాణాతో అక్రమార్కులు రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. సమీపంలోని కోమటివాని చెరువు నుంచి నిబంధనలు ఉల్లంఘించి పగలూ రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి తరలిస్తున్నా.. పట్టించుకునేవారు లేరు. కొందరు అధికారపార్టీ అనుయాయులు పొలాలకు మట్టిని తోలుకుంటామని అనుమతి పొంది, చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి వెంచర్లకు తోలుతూ అడ్డగోలుగా జేబులు నింపుకుంటున్నారు. నల్లచెరువుకు కూతవేటు దూరంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. మండల పరిఽధిలోని రాగన్నగారిపల్లి సమీపంలోని కోమటివాని చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సెలవు దినాలు కావడంతో అధికారులెవరూ అటువైపు వెళ్లరని భావించి శుక్రవారం సాయత్రం నుంచి ఆదివారం వరకూ చెరువులో జేసీబీలు, ఇటాచీలతో తవ్వించి వందలాది టిప్పర్ల మట్టి తరలించేశారు. ఈ మట్టిని మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు తరలించారు. పెద్ద గోతులు పడడంతో భూగర్భజలాలు అడుగంటుతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నల్లచెరువు మండలంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అఽధికారులు మాత్రం చోద్యం చూడటం విమర్శలకు తావిస్తోంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి..

వ్యవసాయ తోటలకు చెరువు మట్టి తరలించాలంటే భూగర్భ గనుల శాఖ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు అనుపతులు తప్పనిసరి. తద్వారా గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుతుంది. అధికార పార్టీ నాయకులు మాత్రం ఇసుక, మట్టి తరలింపునకు అనుమతులు తీసుకోవడంలేదు. కేవలం అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. చెరువు మట్టి భారీగా తరలించడంతో పెద్ద గోతులు పడ్డాయి. వర్షాలు కురవక చెరువుల్లో చుక్క నీరు లేక పంటలుఎండిపోయాయి. మట్టి రవాణాను ప్రశ్నిస్తే.. రైతులపై ఎదురుదాడులకు దిగుతున్నారు.

కోమటివాని చెరువును

మింగిన మాఫియా

యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా

చోద్యం చూస్తున్న అధికారులు

భూగర్భజలాలు అడుగంటాయంటున్న రైతులు

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం

మండలంలో జరుగుతున్న విచ్చల విడిగా సాగుతున్న మట్టి మాఫియా అరాచకాలను గ్రామ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. చెరువులను చెరబడుతన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తాం మండల అధికారులు మాంకెందుకులే అనే దోరణి వదలాలి మట్టి అక్రమరవాణాపై దృష్టి సారించాలి. – బీఎస్‌ ప్రసాద్‌,

గాజేఖాన్‌ పల్లి, నల్లచెరువు మండలం

మట్టిని మింగేస్తున్నారు

రాగన్నగారిపల్లి సమీపంలోని చెరువులో అధికార పార్టీ నేతల అండతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్రమంగా మట్టిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామస్తులపై దాడులకు పాల్పడుతున్నారు. – జె. రామకృష్ణ,

సీఐటీయూ మండల కన్వీనర్‌, నల్లచెరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement