ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం సరికాదు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

పుట్టపర్తి టౌన్‌: కార్మిక, కర్షక సంఘాల ఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు అన్నారు. సోమవారం పుట్టపర్తిలో కార్మిక కర్షక భవన్‌లో సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సర్‌’ పేరుతో తొలగించిన ఓట్లను తిరిగి జాబితాలో చేర్చాలన్నారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని విద్యార్థి, వామపక్ష పార్టీలు చేపట్టిన ఉద్యమాలపై ప్రభుత్వం చేస్తున్న నిర్బంధాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడడానికి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ డిసెంబర్‌ 1,3 తేదీల్లో డిల్లీలో ఆందోళనలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జీఎల్‌ నరసింహులు, దిల్షాద్‌, శ్రీదేవి, గంగాద్రి, సౌభాగ్య, సాంబశివ, బాబా, ఆయూబ్‌, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement