నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రంలోని ప్రశాంతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఏ.శ్యాంప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారించుకోవాలని సూచించారు.

పోలీసు కార్యాలయంలో...

పుట్టపర్తి టౌన్‌: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలపాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.

ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాల గడువు పెంపు

పుట్టపర్తి: ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచిందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కిష్టప్ప, ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్‌ లాజరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 31 వరకూ ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ప్రవేశించవచ్చన్నారు. 14 ఏళ్లు నిండిన వారు 10వ తరగతిలో, 15 ఏళ్లు నిండిన వారు ఇంటర్‌లో ప్రవేశాలు పొందవచ్చన్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ, ఒరియా భాషల్లో విద్యను అభ్యసించవచ్చన్నారు. పాఠశాలలకు వెళ్లే అవకాశం లేని వారు, చదువు మధ్యలో ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.

రెండు ద్విచక్ర వాహనాల ఢీ

● ఇద్దరు యువకుల దుర్మరణం

రామగిరి: మండలంలోని మక్కినవారిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దాసరి హరి (30), హరిజన మురళి (30) దుర్మరణం పాలయ్యారు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాలమేరకు.. పేరూరుకు చెందిన దాసరి హరి, చలమయ్య వ్యక్తిగత పని నిమిత్తం కర్ణాటక రాష్ట్రం తిరుమణికి వెళ్లి వస్తున్నారు. అదే విధంగా తిమ్మాపురానికి చెందిన హరిజన మురళి పని నిమిత్తం పేరూరుకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. మక్కినవారిపల్లి వద్ద మలుపులో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన మురళి, హరి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన చలమయ్యను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement