అగళి: మండల పరిధిలోని హెచ్‌డీ హళ్లి తండాలో గుక్కెడు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. 300 మంది ఈ గ్రామంలో నివసిస్తున్నారు. పంచాయతీ నీటి సరఫరా సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ బోరులో కేవలం 10 నిముషాలకు ఒకసారి మాత్రం కొద్దిపాటి నీరు వస్తుండటంతో దానికోసం గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. చేసేది లేక దూరమైనా వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి బిందెలతో నీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
ప్రభుత్వ బోరు వద్ద నీటి కోసం వేచి ఉన్న తండా ప్రజలు


