ఆరు నెలలుగా సంతకాలతో సరి.. | - | Sakshi
Sakshi News home page

ఆరు నెలలుగా సంతకాలతో సరి..

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

అమడగూరు: స్థానిక తహసీల్దార్‌ ఆరు నెలలుగా జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. దీంతో అధికారులెవరూ మండలంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం లేదు. సోమవారం కూడా తహసీల్దార్‌ జిల్లాకేంద్రానికి వెళ్లగా..ఎంఈఓ జిలాన్‌ బాషా, ఏపీఓ మధుసూదన్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ సునీల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు 60 కి.మీ దూరంలోని పుట్టపర్తికి వెళ్లి జిల్లా స్థాయి పరిష్కార వేదికలో అర్జీలు ఇవ్వాల్సి వస్తోంది. చిన్న సమస్యకు కూడా అంతదూరం వెళ్లాల్సి రావడంతో జనం అధికారుల తీరుపై పెదవి విరుస్తున్నారు.

అధికారులు లేక ఖాళీగా కూర్చున్న వీఆర్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement