నాకు గ్రామంలో వారసత్వంగా సర్వే నంబర్ 184–4లో 3.98 ఎకరాలు వచ్చింది. అయితే గ్రామానికే చెందిన కొందరు నా భూమి ఆక్రమించారు. డూప్లికేట్ పేపర్లు పుట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఆర్డీఓ కోర్టుకు వెళ్లగా...నాకు సానుకూలంగా తీర్పు వచ్చింది. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో వివిధ కోర్టుల్లో కేసులు వేసి గెలిచినా. ఇప్పుడు భూ హక్కుల కోసం ఆరు నెలలుగా ఆర్డీఓ కార్యాలయంలో వరుసగా అర్జీలు ఇస్తున్నా. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ‘పరిష్కార వేదిక‘ నిర్వహించడం ఎందుకు?
– కిష్టప్ప, వడిగేపల్లి, గోరంట్ల మండలం


