చలిమంటలో పడి.. ప్రాణాలు కోల్పోయి
యాడికి: మద్యం మత్తులో ఓ వ్యక్తి చలిమంటలో పడి తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. తూట్రాళ్లపల్లికి చెందిన రామాంజనేయరెడ్డి (55) ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. గత నెల 31న విపరీతంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. చలిగా ఉందని ఇంటి వద్ద మంట వేశాడు. చలి కాచుకుంటున్న సమయంలో మద్యం మత్తులో తూలి మంటలో పడిపోయాడు. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు అనంతపురం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రామాంజనేయరెడ్డి బుధవారం మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


