సిలాట్‌కు సెల్యూట్
హిందూపురం టౌన్: పెంకాక్ సిలాట్.... ప్రస్తుతం యువతను, చిన్నారులను ఉర్రూతలూగిస్తున్న క్రీడ ఇది. శాసీ్త్రయ, ఆధునిక నృత్యాల సమ్మేళితమైన ఈ యుద్ధకళ చూపరులకు వినోదాన్ని పంచడంతో పాటు గగుర్పాటూను కలిగిస్తోంది. ఇంతటి విశిష్టమైన క్రీడలో హిందూపురానికి చెందిన బాలబాలికలు రాణిస్తున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటి పతకాలు కై వసం చేసుకుంటున్రాను.
త్రేతాయుగం నాటిదే...
ప్రత్యర్థి చేతికి అందకుండా శరవేగంగా తప్పించుకుని స్ట్రైకింగ్.. గ్రాఫ్లింగ్ నైపుణ్యాలతో పోరాటం సాగించడం సిలాట్ క్రీడాకారుడి ప్రత్యేకత. ఈ క్రీడ ఇప్పటి కాదని శిక్షకులు అంటున్నారు. త్రేతాయుగంలో వాలి, సుగ్రీవుడి మధ్య సాగిన పోరాట విధానాలను అభివృద్ధి చేసి ప్రస్తుత తరానికి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఇండోనేషియాలో విశేష ప్రాచూర్యమున్న ఈ క్రీడకు ఇప్పుడిప్పుడే దేశీయంగా ఆదరణ కనిపిస్తోంది. ఇప్పటికే దక్షిణ ఆసియా దేశాల్లో విశేష ఆదరణ పొందిన ఈ క్రీడాభివృద్ధికి జిల్లాలో హిందూపురానికి చెందిన జనార్దనరెడ్డి బీజమేశారు.
ఆకట్టుకునే విన్యాసాలు..
పెంకాక్ సిలాట్‌లో క్రీడాకారుడు ప్రదర్శించే విన్యాసాలు దాదాపు శాసీ్త్రయ, ఆధునిక నృత్యాలను యుద్ధకళతో సమ్మేళితం చేసినట్లుగా కనిపిస్తుంది. కరాటేలోని స్ట్రైకింగ్ వేగం... కుంగుఫూలోని త్రోయింగ్... జూడోలోని పట్లతో కూడిన ఈ క్రీడలో శరీరంలోని ప్రతి భాగాన్ని ఉపయోగిస్తుంటారు. అలాగే శరీరంలోని ప్రతి భాగమూ ప్రత్యర్థి నుంచి దెబ్బతినే అవకాశమూ ఉంటుంది. దీంతో క్రీడాకారుడు నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఈ క్రీడ దోహదపడుతోంది. కరాటే, కుంగుఫూ తదితర క్రీడల్లో ఉన్నట్లుగానే ఈ క్రీడలోనూ ప్రధానంగా ఆరు విభాగాలను క్రీడాకారులు అభ్యసించాల్సి ఉంటుంది. ప్రధానంగా రెగు, తుంగల్, గండ, సోలో, ఆర్టిస్టిక్, టాండింగ్ వంటి విన్యాసాల్లో ప్రావీణ్యం కనబరిస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సహాకాలు ఉంటాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
జిల్లాలో రాణిస్తున్న క్రీడాకారులు..
జిల్లాలో ఇటీవల సిలాట్ క్రీడపై హిందూపురం ప్రాంత యువతులు, బాలబాలికలు మక్కువ పెంచుకున్నారు. ఇక్కడి విద్యార్థులు, ఆసక్తి ఉన్న యువతకు సిలాట్‌పై మార్షల్ ఆర్ట్స్ కోచ్‌లు జనార్దన్‌రెడ్డి, రఫీక్ అహమ్మద్, రియాజ్, బాబా ఫకృద్దీన్, ప్రవీణ్ ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. వీరి చొరవతో విద్యార్థులు క్రీడలో రాణించి జోనల్, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. గత ఏడాది రాష్ట్ర స్థాయి, సౌత్ జోన్ స్థాయిలో జరిగిన పోటీల్లో హిందూపురానికి చెందిన మధుర, తన్వితరెడ్డి, మీన రాణించారు. ఒంగోలు, నెల్లూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలు సీనియర్ విభాగంలో నస్రీన్, శరణ్య, మదిహ విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. కేరళలోని తిరువనంతపురం, పాండిచ్చేరిలో జరిగిన సౌత్‌జోన్ మీట్‌లోనూ పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఇటీవల కర్ణాటకలోని కొప్పల్ వేదికగా జరిగిన 13వ జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిథ్యం వహించిన హిందూపురానికి చెందిన పదేళ్ల తనీశ్వర్‌రెడ్డి, ఆరేళ్ల అఫిఫాకౌసర్, 14 ఏళ్ల మదీహ భాను ప్రతిభ చూపి బంగారు, వెండి, కాంస్య పతకాలతో మెరిశారు.
నూతన క్రీడపై జిల్లా యువత ఆసక్తి
ఆహ్లాదంతో పాటు స్వీయరక్షణ
నృత్యం సమ్మేళితమైన యుద్ధకళ
క్రీడాభివృద్ధికి చర్యలు
వాస్తవానికి ఈ క్రీడకు అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ ఉంది. ఒలంపిక్ క్రీడల్లోనూ చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బాలికల స్వీయరక్షణకు ఈ క్రీడ ఎంతో ఉపయుక్తం. చాలా మందికి సిలాట్‌లోని ప్రత్యేకత తెలియక ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో మరింతగా ఈ క్రీడను వ్యాప్తి చేయాలని ప్రయత్నిస్తున్నాం. – జనార్దనరెడ్డి,
సిలాట్ శిక్షకుడు, హిందూపురం
సిలాట్‌కు సెల్యూట్
సిలాట్‌కు సెల్యూట్
సిలాట్‌కు సెల్యూట్
సిలాట్‌కు సెల్యూట్


