పుట్టపర్తి: రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానంలో అందజేయనున్న పాఠ్యపుస్తకాల రచనకు బుక్కపట్నం మండలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మహేష్, పరిగి మండలంలో పనిచేస్తున్న టీచర్ గణేష్ ఎంపికయ్యారు. వీరు ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకూ విజయవాడలో నిర్వహించిన వర్క్‌షాపులో పాల్గొన్నారు. 1 నుంచి 8వ తరగతి వరకూ నూతన విద్యావిధానం –2020 అనుసరించి ఎన్‌సీఈఆర్‌టీ తరహాలో పాఠ్యాంశాలను రూపొందించనున్నారు.
బాలికల హాస్టల్‌లో ప్రవేశించిన
యువకుడికి రిమాండ్
కదిరి టౌన్: స్థానిక అడపాలవీధిలో ఉన్న ఎస్టీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఈ నెల 4న అక్రమంగా చొరబడిన కుమ్మరోళ్లపల్లికి చెందిన యువకుడు ఎర్ల మహేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు. సెక్యూరిటీ గార్డు ఉమాదేవి ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం ఉదయం కుమ్మరోళ్లపల్లి శివారున మహేష్‌ను అరెస్ట్ చేసి, కదిరి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
విద్యుదాఘాతంతో
జేఎల్‌ఎం మృతి
హిందూపురం: విద్యుత్ షాక్‌కు గురై హిందూపురం మండలం తూముకుంటకు చెందిన జూనియర్ లైన్‌మెన్ రమేష్ మృతిచెందాడు. సోమవారం స్తంభంపైకి ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఉన్నఫళంగా కరెంట్ సరఫరా జరిగింది. దీంతో షాక్‌కు గురై కిందపడి, అక్కడికక్కడే మృతి చెందాడు. మరమ్మతుల కోసం 11 కేవీ లైన్‌కు ఎల్‌సీ తీసుకున్నా.. కరెంట్ సరఫరా ఎలా జరిగిందనే అంశంపై విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
పులివెందుల వాసి దుర్మరణం
ముదిగుబ్బ: మండల కేంద్రం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు..పులివెందులకు చెందిన గౌస్‌పీరా(48) భార్య నూర్జహాన్‌తో కలిసి ధర్మవరంలోని అత్తారింటికి వెళ్లారు. అనంతరం బైక్‌పై భార్యతో కలిసి పులివెందులకు బయలుదేరాడు. ముదిగుబ్బ సమీపంలో కదిరి నుంచి వస్తున్న కారును బైక్ ఢీకొంది. ఘటనలో గౌస్‌పీరాకు తీవ్రగాయాలయ్యాయి. భార్య స్వల్పగాయాలతో బయటపడింది. క్షతగాత్రుడిని అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ పాఠ్య పుస్తక రచనకు జిల్లా ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠ్య పుస్తక రచనకు జిల్లా ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠ్య పుస్తక రచనకు జిల్లా ఉపాధ్యాయులు
ప్రభుత్వ పాఠ్య పుస్తక రచనకు జిల్లా ఉపాధ్యాయులు


