
రొళ్ల ఎంపీడీఓకు ‘షోకాజ్’
రొళ్ల: విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ఎంపీడీఓ నాగేశ్వరరావు శాస్త్రికు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసును జెడ్పీ సీఈఓ శివశంకర్ జారీ చేశారు. విధుల సమయంలో కర్ణాటకలోని చంద్రబావి వద్ద ఉన్న ఓ బార్ ఎంపీడీఓ గడుపుతూ, ప్రజా సమస్యలు పట్టించుకోవడం దంటూ ఎంపీపీ కవిత, ఆమె భర్త విజయరంగేగౌడు పలుమార్లు జెడ్పీ సీఈఓకు ఫిర్యాదు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో పాలనా పరమైన ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో గురువారం సాయంత్రం కలెక్టర్ శ్యాంసుందర్‌కు ఎంపీపీ ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీఓకు జెడ్పీ సీఈఓ షోకాజ్ నోటీసు జారీ చేశారు.