మురళీనాయక్ ప్రాణత్యాగం వృథా కాదు
గోరంట్ల: పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ ప్రాణత్యాగం వృఽథా కాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉష శ్రీచరణ్‌తో కలసి ఆదివారం గోరంట్ల మండలం కల్లితండాకు విచ్చేసిన ఆయన... మురళీనాయక్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వీరజవాన్ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం మురళీనాయక్ చేసిన పోరాటం లక్షలాదిమంది యువతకు స్ఫూర్తినిచ్చిందన్నారు. వీరజవాన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి


