నిమ్మకు తగ్గని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

నిమ్మకు తగ్గని డిమాండ్‌

Oct 11 2026 12:21 AM | Updated on Oct 11 2026 12:21 AM

● స్వల్పంగా పెరుగుతున్న దిగుబడి

పొదలకూరు: నిమ్మకు డిమాండ్‌ తగ్గడం లేదు. విజయదశమిని పురస్కరించుకొని మార్కెట్లో కొంత సందడి నెలకొంటోంది. కాయల దిగుబడి లేక మార్కెట్‌ వెలవెలబోతున్న తరుణంలో తోటల నుంచి మోస్తరుగా వస్తున్నాయి. దీంతో కిలో రూ.70 నుంచి రూ.120 పలుకుతోంది. బస్తాల్లెక్కన పరిశీలిస్తే ఇది రూ.5600 నుంచి రూ.9600 వరకు ఉంటోంది. ఫలితంగా రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. మార్కెట్‌ నుంచి నిత్యం నాలుగు లారీల్లో కాయలను ఎగుమతి చేస్తున్నామని వ్యాపారులు వెల్లడించారు. కాయల్లేని సమయంలో మార్కెట్‌ నుంచి ఒకట్రెండు లారీల్లోనే ఎగుమతయ్యేవి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌కూ పంపుతున్నారు.

క్వాలిటీవి చైన్నెకి..

క్వాలిటీ నిమ్మ కాయలను చైన్నె, మదురై ప్రాంతాలకు వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. సైజ్‌ బాగా ఉండటంతో చైన్నె ప్రాంత వాసులు బాగా కొనుగోలు చేస్తుంటారు. గతేడాది ఇదే సీజన్లో కాయలు బాగా దిగుబడైనా ధరలు ఈ స్థాయిలో లేవు. గతేడాదితో పోలిస్తే 50 శాతం మేరే దిగుబడులున్నాయని వ్యాపారులు తెలిపారు. కొందరు రైతుల తోటల్లో ఇప్పటికీ కాయలు లభ్యమవుతుండటంతో లాభాలను ఆర్జిస్తున్నారు.

బస్తా

కాయలు రూ.9500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement