నెల్లూరు(క్రైమ్): జిల్లాలో మొదటి విడత లాటరీ డ్రాలో మిగిలిపోయిన 24 మద్యం దుకాణాలకు రీ నోటిఫికేషన్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసులునాయుడు శనివారం జారీ చేశారు. ఆసక్తి గల వారు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లో దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల్లోపు సమర్పించొచ్చని చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో లాటరీ డ్రాను ఈ నెల 21న నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నామని పేర్కొన్నారు.
దుకాణాలివే..
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఏడు.. అల్లూరు నగర పంచాయతీ, కోవూరు, కలిగిరి, కొండాపురం, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు, ఆత్మకూరు మున్సిపాల్టీ, ఆత్మకూరు మండలంలో ఒకటి చొప్పున.. మర్రిపాడులో రెండు.. గూడూరు మున్సిపాల్టీలో నాలుగు.. చిల్లకూరులో రెండు షాపులున్నాయి. దుకాణాల పరిధిని బట్టి వార్షిక రిటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (ఆర్‌ఈటీ) రూ.60.5 లక్షల నుంచి రూ.93.5 లక్షల వరకు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.ఐదు లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు నిర్ణయించారు. ఒక్కో దుకాణానికి నాన్ రీఫండబుల్ రుసుమును రూ.మూడు లక్షలుగా ఖరారు చేశారు.


