● గంటపాటు స్తంభించిన ట్రాఫిక్
దగదర్తి: మండల పరిధిలోని అల్లూరు రోడ్డు జాతీయ రహదారిపై రైల్వే వంతెన వద్ద మంగళవారం రాత్రి చైన్నె నుంచి హైదరాబాద్‌కు ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. కంటైనర్ లారీ రోడ్డుకు అడ్డంగా పడటంతో హైవేపై సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఎస్సై మహేంద్ర, సీఐ శివశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు. హైవే మొబైల్ పోలీసులు వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బుధవారం క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించారు.


