కేసులకు భయపడేది లేదు | - | Sakshi
Sakshi News home page

కేసులకు భయపడేది లేదు

Oct 8 2026 12:24 AM | Updated on Oct 8 2026 12:24 AM

ఇందుకూరుపేట: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఇందుకూరుపేటలో నిర్వహించిన నిరసన ర్యాలీకి సంబంధించి నమోదైన కేసులో పార్టీ నేతలకు పోలీసులు బుధవారం 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇందుకూరుపేట పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 19 మందిపై కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితోపాటు రాష్ట్ర సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు, పలువురు సీనియర్‌ నాయకులు బుధవారం పోలీస్‌స్టేషన్‌కు హాజరై 41ఏ నోటీసులు స్వీకరించారు. వారితోపాటు నాయకులు గొల్లపల్లి విజయకుమార్‌, మావులూరు శ్రీనివాసులురెడ్డి, బట్టేపాటి నరేంద్రరెడ్డి, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, షేక్‌ షాహుల్‌, అత్తిపల్లి అనూప్‌రెడ్డి, కాటంరెడ్డి నవీన్‌రెడ్డి, చెర్లో సతీష్‌రెడ్డి, కందుకూరి యానాదిరెడ్డి, తుమ్మల ప్రసాద్‌రెడ్డి, గండవరపు వివేకానందరెడ్డి, బొచ్చు శ్రీనివాసులు, నెలవాయి మాణిక్యరావు తదితరులు నోటీసులు అందుకున్నారు.

ప్రజాస్వామ్య పద్ధతిలోనే నిరసన

ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఆందోళన చేపట్టామన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం రాజకీయ పార్టీల బాధ్యతలో భాగమని స్పష్టం చేశారు. కేసులు, నోటీసులకు భయపడి ప్రజా సమస్యలపై పోరాటాన్ని విరమించబోమని ప్రసన్న తెలిపారు. ప్రజల కోసం నిర్వహించే ఆందోళనలకు ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాపాడేందుకు తమ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందన్నారు. డీఎస్సీ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో పాటు అభ్యర్థులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు

మాజీ మంత్రి నల్లపరెడ్డి

ప్రసన్నకుమార్‌రెడ్డి

డీఎస్సీ నిరసన ర్యాలీ కేసులో

వైఎస్సార్‌సీపీ నేతలకు 41ఏ నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement