భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్సార్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో నెల్లూరీయులు సత్తాచాటారు. సీనియర్ రికర్వ్ మెన్ విభాగంలో నెల్లూరుకు చెందిన ఆర్.సాయి మౌర్య, పి.రాజేష్ ప్రతిభ చూపారు. ఈ క్రమంలో విజేతలకు బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్, వెస్ట్ గోదావరి ఆర్చరీ అసోసియేషన్, భీమవరం ఆర్చరీ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ హాజరై, బహుమతులు అందజేశారు.


