‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

● రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి అన్నారు. నెల్లూరు చింతారెడ్డిపాళెంలో మంగళవారం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మండల కమిటీ సభ్యులకు పార్టీ గుర్తింపుకార్డులు అందజేశారు. అనంతరం ఆనం మాట్లాడుతూ రూరల్‌ నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఐడీ కార్డు ఉండే ప్రతి కార్యకర్తను అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా గుర్తిస్తారన్నారు. ఎన్నికల్లో విజయం సాధించేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీసునంద, రూరల్‌ మండల అధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేజర్లలో గాలివాన బీభత్సం

● సోమశిల – పొదలకూరు రహదారిపై నిలిచిన రాకపోకలు

చేజర్ల: మండలంలోని ఆదూరుపల్లి, ఏటూరు, నూతక్కి వారి కండ్రిక, వావిలేరు, గాలిపాళెం తదితర గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన కురిసింది. ఈదురుగాలులతో సోమశిల – పొదలకూరు ప్రధాన రహదారిపై నూతక్కివారికండిక గ్రామం వద్ద తాటిచెట్లు, ఇతర వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోయయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement