రైల్వేస్టేషన్‌లో కార్మికుల మెరుపు సమ్మె | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో కార్మికుల మెరుపు సమ్మె

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): నెల్లూరు రైల్వేస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు పారిశుద్ధ్య కార్మికులకు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ.. తోటి కార్మికులు మంగళవారం మెరుపు సమ్మె చేశారు. ఈ సందర్భంగా రైల్వే కాంట్రాక్ట్‌ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్‌ గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ రంగస్వామి కార్మికుల బోనస్‌ నగదును బలవంతంగా తీసుకున్నట్లు చెప్పారు. రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. సూపర్‌వైజర్‌ సురేష్‌ మహిళా కార్మికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. స్టేషన్‌లో పారిశుద్ధ్య పనులు చేయాల్సిన కార్మికులతో కాంట్రాక్టర్‌ తన ఇంటి పనులు చేయించుకుంటున్నాడని ఆరోపించారు. ప్రశ్నించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తొలగిచడం దారుణమన్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాంగ్‌ చేశారు. అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ నాయకులు, ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ న్యాయవాదులతో కలిసి స్టేషన్‌ మేనేజర్‌ శివయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, నగర కార్యదర్శి నాగేశ్వరరావు, న్యాయవాది పచ్చా కిరణ్‌, నాయకులు సుధాకర్‌, చెంగయ్య, బసవయ్య, జహీర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement